24.7 C
Hyderabad
March 29, 2024 05: 17 AM
Slider నిజామాబాద్

గిరిజన కుటుంబాలకు న్యాయం చేయండి

#MandaKrishnaMadiga

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హన్మజిపేట్ పంచాయతీ చత్రు నాయక్ తండాలో అన్యాయానికి గురైన గిరిజన కుటుంబాలకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యస్థాపకులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేసారు. బాన్సువాడ మండలంలోని చత్రు నాయక్ తండాలో గిరిజనులకు జరిగిన అన్నాయాన్ని సామాజిక మాధ్యమాల్లో, సంబంధిత సామాజిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఆయన ఆదివారం చత్రు నాయక్ తాండలో పర్యటించి బాధితుల నుండి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం అటవీశాఖ అధికారులు బాధితులపై జరిగిన దాడిపై తీవ్రంగా ఖండించారు. గత కొన్ని సంవత్సరాలుగా భూమి గిరిజనుల స్వాధీనంలో ఉందని అన్నారు. గత రెండు రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు సంబంధించిన భూములపై దాడులు చేశారని అన్నారు.

ఆటవీ భూములపై గిరిజనులకు హక్కు ఉంటుందని అన్నారు. అయినా అధికారులు హక్కు ఉన్నవారికి సమాచారం ఇవ్వాలని, ఏలాంటి సమాచారం ఇవ్వకుండా పెట్టుబడులు పెట్టి పంటలు వేసుకున్న రైతులపై దాడులు జరిపి అన్యాయం చేశారన్నారు. ఈ విషయమై బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.

ఆయన వెంట ఎమ్మార్పీఎస్ నాయకులు దల్లా సురేష్ మాదిగ, రోడ ప్రవీణ్, ప్రవీణ్ మ దిగ, అభినయ్, పండు, కిరణ్, ఏర్రవట్టి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Related posts

సోమవారం నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు

Satyam NEWS

విజయనగరం పోలీసు బాస్ ఆకస్మిక తనిఖీ.. స్టేషన్ తెలుసా…?

Satyam NEWS

గద్దర్ కొత్త పార్టీ

Bhavani

Leave a Comment