34.2 C
Hyderabad
April 23, 2024 11: 41 AM
Slider క్రీడలు

మండల స్థాయి సిఎం కప్ 2023 ను విజయవంతం చేయాలి

#cmcup

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చీఫ్ మినిస్టర్ కప్ 2023 ను మండల స్థాయిలో విజయవంతం చేయాలని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్,జెడ్పిటిసి కొప్పల సైదిరెడ్డి సంయుక్తంగా తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం చీఫ్ మినిస్టర్ కప్ 2023 నకు సంబంధించి ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి హాజరయ్యారు.

అనంతరం వారు మాట్లాడుతూ మండల స్థాయి చీఫ్ మినిస్టర్ కప్ 2023 స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్యాంపు, హుజూర్ నగర్ నందు ఈనెల 15వ,తేదీ నుండి 17వ,తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి నిర్వహించబడునని,ఈ కప్ పోటీలకు 15 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల వరకు గల యూత్ అర్హులని, ఈ పోటీలు అథ్లెటిక్స్,ఫుట్ బాల్,కబడ్డీ,ఖో ఖో,వాలీబాల్ పురుషులకు,మహిళలకు నిర్వహించబడతాయని తెలిపారు.

ఈ పోటీలలో హుజూర్ నగర్ మండలం లోని అన్ని గ్రామాల యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా,రాష్ట్ర స్థాయిలో రాణించి మండలానికి పేరు తీసుకురావాలని అన్నారు. గ్రామ స్థాయిలోని వివిధ ప్రజా ప్రతినిధులు యువత అధికంగా పాల్గొనే విధంగా సహకరించాలని కోరారు. ఈ ఆటల పోటీలలో ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శాంతకుమారి,డిప్యూటీ తాసిల్దార్ సుధారాణి, సూపరిండెంట్ నర్సిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ,పి ఈ టీ లు  సునీల్,బ్రహ్మారెడ్డి,శ్రీధర్,రవీందర్ రెడ్డి, విజయ్,సిఆర్పి సైదులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

టీఆర్ఎస్ నేత కేశవరావుకు తిరుమలలో ఘన స్వాగతం

Satyam NEWS

రాసలీలల వైకాపా నేతలు మాధవ్, అంబటి దిష్టి బొమ్మల దహనం

Satyam NEWS

అస్సాంలో ఉగ్రవాదులతో ఎన్ కౌంటర్: ఒకరి మృతి

Bhavani

Leave a Comment