39.2 C
Hyderabad
March 29, 2024 15: 01 PM
Slider కరీంనగర్

మానేరు రివర్ ఫ్రంట్ కు మహర్దశ

#maneru

కరీంనగర్ తలాపున ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే రిటెయినింగ్‌ వాల్‌, రోడ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక హంగులతో 70 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఫౌంటెన్‌ పనులకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆదివారం భూమిపూజ చేశారు. కరీంనగర్‌కు ముఖద్వారంగా దిగువ మానేరు జలాశయం ముందు భాగం మానేరు నదిపై ఉన్న రెండు వంతెనల మధ్య ఏర్పాటు చేయనున్న ఈ బృహత్తర ప్రాజెక్టు పర్యాటక శోభను తీసుకువస్తుంది. మంత్రి గంగుల కమలాకర్‌ మానేరు రివర్‌ ఫ్రంట్‌, ఆ పక్కనే తీగలవంతెన నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దగ్గరుండి పనులను ముందుకు నడిపిస్తున్నారు.

ఇటీవల సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించి పలు సలహాలు, సూచనలిచ్చారు. ప్రాజెక్టు పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని అవసరమైన ఆదేశాలిస్తున్నారు. ఆగస్టు 15 నాటికి మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులను పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభించే విధంగా జిల్లా మంత్రి, అధికారయంత్రాంగం కృషి చేస్తున్నారు.

3.75 కిలోమీటర్ల మేర మొదటి దశ పనులు

దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎండి) నుంచి 10 కిలో మీటర్ల నిడివిలో చేపట్టనున్న మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టులో మొదటి దశలో 3.75 కిలోమీటర్ల పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రెండవ దశలో 6.25 కి.మీ. పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌కు ఇరువైపులా అందమైన పార్కులు, వాటర్‌ ఫౌంటెన్ల్లు, థీమ్‌ పార్కులు, వాటర్‌ స్టోర్స్‌, మ్యూజికల్‌ ఫౌంటెన్లు, ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రివర్‌ ఫ్రంట్‌లో 12 నుంచి 13 ఫీట్ల లోతులో నీరు నిల్వ ఉంచి, స్పీడ్‌ బోట్లు, క్రూయిజ్‌ బోట్లను ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు.

ఐదేళ్ల కిందట ముఖ్యమంత్రి  కేసీఆర్ దిగువ మానేరు జలాశయం చెంతన సుందరమైన పర్యాటక ప్రాంతాన్ని ఆహ్మాదాబాద్ లోని సబర్మతి తరహాలో నిర్మించాలనే తలంపును తెలియజేశారు. జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేకంగా చొరవ చూపించి నిధుల్ని రాబట్టడంతోపాటు నీటిపారుదల, పర్యాటక శాఖలను సమన్వయపరుస్తూ పలు సమీక్షలతో ప్రగతిసాకరమయ్యేందుకు తనవంతు కృషిని చూపించారు.

2.6 కి.మీ మేర నిర్మాణం..

మొదటి అంచెలో భాగంగా రూ. 308 కోట్లతో కీలకమైన ప్రాథమిక దశలోని పలునిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మంత్రి గంగుల పర్యవేక్షణలో పనులన్ని చక చక కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎల్ఎండీ గేట్ల నుంచి దిగువనకు ఉన్న నీటి ప్రవా హానికి ఇరువైపుల భారీ ప్రహరీలను నీటి అడుగు నుంచి నిర్మించబోతున్నారు. 10 కి.మీ దూరం నిర్మించే ఈ మానేరురివర్ ఫ్రంట్ లో ప్రాధాన్యం గల ఈ పనులన్ని పురోగతి లో వున్నాయి.

ఇందుకోసం ఇప్పటికే పూర్తయిన సమగ్ర ప్రగతి నివేదిక ఆధారంగాఇక్కడ నిర్మాణాల్నిచేపట్ట బోతున్నారు. ముందుగా ప్రస్తుతం ఉన్న అలుగునూర్ బ్రిడ్జి నుంచి ఎల్‌ఎండీ గేట్ల వైపునకు 200 మీటర్ల నుంచి ఇరువైపుల ప్రహారీలను నిర్మించబోతున్నారు. ఇక్కడ 300 మీటర్ల మేర ఎత్తు నీళ్లు నిలిచి ఉండేలా ప్రణాళికను రూపొందించారు. ఇందుకోసం ఇప్పుడున్న అడుగు భాగాన్ని అవసరమైన చోట చదును చేయడంతోపాటు 3మీటర్ల లోతుకు చదును చేస్తున్నారు. నేల కింది భాగం నుంచి 16 అడుగుల ఎత్తువరకు గోడల నిర్మాణాలు ఇరువైపుల ఉంటాయి. వీటిని ఆనుకుని మొదటి దశలో ఇరువైపుల 8 అడుగుల నిర్మాణాన్ని పర్యాటకులు వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.

నీటి మట్టం నుంచి రెండు దిక్కుల 4.8 మీటర్ల ఎత్తులో పాదచారులు నడిచేందుకు, పర్యాటకులు కూర్చుని వీక్షించేందుకు బెంచీలను ఏర్పాటు చేస్తారు. ఇలా అలుగునూర్ వంతెన నుంచి తీగల వంతెన దాటిన కొద్దిదూరం వరకు 2.3 కి.మీ మేర ఇలా నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

నీటి నిల్వతో కొత్త సోయగం

ఎల్ఎండీ దిగువన 10 కి.మీ మేర నీళ్లు నిలబడి అందమైన ప్రాంతంగా మార్చేందుకే ఈ మానేరు రివర్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశలో ఈ నిర్మాణాల తరువాత ఇరువైపుల హోటళ్ల నిర్మాణాలు, బృందావనాల ఏర్పాటుతోపాటు వాటర్ ఫౌంటేన్లు, ఇతరత్రా సుందరమైన నిర్మా ణాల్ని పర్యాటకులు వీక్షించేలా చేపట్టబోతున్నారు. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ సహా అధికారుల బృందం సబర్మతిని సందర్శించారు.

అక్కడ ఉన్న నమూనాలకు భిన్నంగా ఇక్కడి ప్రాంతాన్ని నిర్మించేలా సరికొత్త నిర్మాణశైలిని రివర్‌ఫ్రంట్‌కు అనుసంధానించబోతున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంరూ.410 కోట్లు కాగామొదటి దశలో రూ. 308 కోట్లతో టెండర్లుపూర్తయ్యాయి. మిగతా రూ. 102 కోట్ల పనులను పర్యాటక శాఖ పర్యవేక్షిస్తుంది..దానిలో భాగంగా 70 కోట్లతో అతిపెద్ద వాటర్ ఫౌంటెన్ నిర్మాణ పనులకు మంత్రి గంగుల కమలాకర్ నేడు పూజ చేయనున్నారు.

మొదటి దశలో నిర్మించేచోట ఎన్ఎండీ చెంతన 300 మీటర్ల వెడల్పుతో ప్రారంభమయ్యే నీటి నిల్వప్రాంతం 10 కి.మీ దూరానికి వెళ్లే సరికి 400 మీటర్ల ప్రాంతంగా మారనుంది. అక్కడ నీటిని నిలిపేందుకు వీలుగా సరికొత్త తరహాలో చెక్ డ్యామ్ మరియు 4 గేట్లతో బ్యారేజీని నిర్మించనున్నారు. సగం మేర అంటే 210 మీటర్ల దూరం బ్యారేజీ దానికి ఆనుకుని 190 మీటర్ల గోడతో కూడిన చెక్ డ్యామ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇరువైపుల పలుచోట్ల నీటిని తాకేలా మెట్లను కూడా నిర్మాణమవుతాయి.

Related posts

కొంతమంది పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదు

Satyam NEWS

భరత్ తో అసత్యాలు చెప్పిస్తున్నదెవరు?

Satyam NEWS

జాతిని మోసం చేస్తున్న నరేంద్ర మోడీ

Murali Krishna

Leave a Comment