29.7 C
Hyderabad
April 18, 2024 04: 09 AM
Slider జాతీయం

మంగళగిరిలో ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్ర‌ధాని

#aiimes

మంగళగిరిలో నిర్మించిన ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థను జాతికి అంకితం చేశారు.  ఎయిమ్స్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, భారతి ప్రవీణ్, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 5 ఎయిమ్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఏక కాలంలో ప్రారంభించారు.

మంగళగిరి ఎయిమ్స్‌తో పాటు రాజ్ కోట్ (గుజరాత్), భటిండా (పంజాబ్), రాయ్ బరేలీ (ఉత్తరప్రదేశ్), కల్యాణి (పశ్చిమ బెంగాల్) ఎయిమ్స్‌లను కూడా మోదీ ప్రారంభించారు.  ఈ సందర్భంగా ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ, స్వాతంత్య్రం  వచ్చిన 50 ఏళ్ల పాటు దేశంలో ఒకే ఒక ఎయిమ్స్ ఉండేదని, అది కూడా ఢిల్లీలో ఉండేదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 7 దశాబ్దాలకు 7 ఎయిమ్స్‌లకు ఆమోదం లభిస్తే, వాటిని కూడా పూర్తి చేయలేకపోయారని గత ప్ర‌భుత్వాలపై మోదీ విమర్శలు చేశారు. ఇప్పుడు కేవలం 10 రోజుల్లోనే 7 కొత్త ఎయిమ్స్‌ను ప్రారంభించడమో, లేదా శంకుస్థాపన చేయడమో జరిగిందని, దీన్నిబట్టి గత ఆరేడు దశాబ్దాలతో పోల్చితే ఇప్పుడు దేశాభివృద్ధి వేగం పుంజుకుందని వివరించారు.

రూ.1618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్‌­ని నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌ క్యాంపస్‌లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌తో పాటు రూ.2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ప్రధాని ప్రారంభించారు. అలాగే ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌లో భాగంగా రూ.230 కోట్ల విలువైన 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లకు కూడా ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

వీటిలో ప్రధానంగా వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం జిల్లా­ల్లోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో రూ.23.75 కోట్ల చొప్పున, తెనాలి జిల్లా ఆస్పత్రిలో రూ.44.50 కోట్లు, హిందూపూర్‌ జిల్లా ఆస్పత్రిలో రూ.22.25 కోట్లతో చేపట్టనున్న క్రిటికల్‌ కేర్‌ బ్లాకుల్ని నిర్మించనున్నారు. మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌తో పాటు రాజ్‌కోట్‌ (గుజరాత్‌), రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్‌), బఠిండా (పంజాబ్‌), కల్యాణి (పశ్చిమబెంగాల్‌) నగరాల్లో ఎయిమ్స్‌ ఆస్పత్రులను కూడా ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు.

Related posts

ప్రశ్నించేవారిని పోలీసులతో వేధిస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

టీచర్ల కృషి వల్లనే కేఎన్ఆర్ స్కూలుకు ప్రఖ్యాతి

Bhavani

కోర్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment