37.2 C
Hyderabad
March 29, 2024 19: 48 PM
Slider గుంటూరు

సూపర్ స్టార్ కృష్ణకు మంగళగిరి అభిమానులు నివాళులు

#superstarkrishna

సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని మంగళగిరి కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ తాడిబోయిన మహేష్ యాదవ్, అసోసియేషన్ ప్రతినిధులు సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించి పులమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ మహేష్ యాదవ్ మాట్లాడుతూ. సూపర్ స్టార్ కృష్ణకు మంగళగిరి, మంగళగిరి ప్రజలు అంటే ఎంతో  ఇష్టమన్నారు. తాము హైదరాబాదు సూపర్ స్టార్ కృష్ణ ను కలవడానికి వెళ్ళినప్పుడు తమను ఎంతో ఆప్యాయత పలకరిస్తారన్నారు. ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణకు మంగళగిరిలో స్వయంగా కుట్టించి ఆరు ఏడు జతలు బట్టలు ఇస్తామన్నారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఇచ్చిన బట్టలనే ధరించడం ఆయనకు అభిమానులపై ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనమన్నారు.

Related posts

ఆదివాసీలకు ఉచిత వైద్యం అందించిన రెడ్ క్రాస్ సంస్థ

Satyam NEWS

వైసీపీ 16 నెలల పాలనలో అరాచకాలు, మతాల మధ్య చిచ్చు

Satyam NEWS

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడు

Satyam NEWS

Leave a Comment