బైంసా అల్లర్లలో నష్టపోయిన హిందువుల కుటుంబాలను త్వరలో పరామర్శిస్తామని మంత్రాలయ పీఠాధిపతి వెల్లడించారు. బాధిత కుటుంబాలకు తమ మఠం నుంచి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అఖిలభారత బ్రాహ్మణ అర్చక సేవా సంఘం అధ్యక్షుడు, తెలంగాణ హిందూ మహాసభ అధ్యక్షులు రాహుల్ దేశ్ పాండే నేడు మంత్రాలయ పీఠాధిపతిని కలిశారు.
బైంసాలో ఇటీవల కొంతమంది ముష్కరుల దాడిలో హిందువుల ఆస్తులు ధ్వంసమైన విషయాన్ని మంత్రాలయ పీఠాధిపతి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. అందరూ కూడా ధైర్యంగా ఉండాలని తాము అందరికి అండగా ఉంటామని సందేశాన్ని తెలియజేయవలసిందిగా స్వామీజీ దేశ్ పాండే కు తెలిపారు.