39.2 C
Hyderabad
March 28, 2024 16: 25 PM
Slider కర్నూలు

మంత్రాలయం పుష్కర్ ఘాట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

#KurnoolCollector

కర్నూలు జిల్లా లోని మంత్రాలయం మండల  పరిధిలోని పుష్కర ఘాట్ లను జిల్లా కలెక్టర్ వీరపాండియన్ జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కిరప్ప పరిశీలించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోమీడియా సమావేశం లో మాట్లాడుతూ నవంబర్ 20తేదీ నుండి డిసెంబర్ ఒకటో తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు ఉన్నందున మంత్రాలయంలో మూడు పుష్కర ఘాట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సోషల్ డిస్టెన్స్ ను, మాస్క్ లను ధరించి పుష్కరాలకు రావాలని కలెక్టర్ కోరారు. పుష్కర ఘాట్  పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పుష్కర స్నానాలకు  వచ్చే భక్తులకు ఈపాస్ ద్వారానే అనుమతి లభిస్తుందని చెప్పారు.

60 సంవత్సరాలు వృద్ధులకు, చిన్న పిల్లలు వీరిని పుష్కర ఘాట్ లోకి అనుమతించరాదని అధికారులకు సూచించారు. భక్తులు ఎవరైనా తుంగభద్ర పుష్కర జలాలు కావాలంటే పోస్టల్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కిరప్ప, జాయింట్ కలెక్టర్( సంక్షేమం), సయ్యద్ ఖాజా మొయినుద్దీన్, ఆర్డీవో రామకృష్ణారెడ్డి మంత్రాలయం ఎమ్మార్వో చంద్రశేఖర్ , వీఆర్వో, ఈవో ఆర్ డి  నాగేష్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏ ఈ గుర్రప్ప, సి ఐ కృష్ణయ్య, మాధవరం ఎస్ఐ బాబు  వైసిపి నాయకులు, భీమ్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, బాబు రెడ్డి , కృష్ణారెడ్డి  ,మాజీ సర్పంచ్ భీమయ్య, ఎంపీటీసీ సభ్యులు వెంకటేష్ శెట్టి, జనార్ధన్ రెడ్డి  హోటల్ పరమేశ్ స్వామి, వీరయ్య శెట్టి శివప్ప తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related posts

ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి

Bhavani

తెలంగాణ గ్రూప్ 1 అధికారుల అధ్య‌క్షుడి ఎన్నిక‌

Sub Editor

హనుమకొండలో బాలబాలికలకు ఉచిత ఆరోగ్య శిబిరం

Bhavani

Leave a Comment