36.2 C
Hyderabad
April 16, 2024 18: 58 PM
Slider విశాఖపట్నం

కీలక మావోయిస్టు నాయకుడిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు

#MaoistLeader

సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు (ఏసీఎం)  గెమ్మిలి కామేష్ ను విశాఖపట్నంలోని జి.కె. వీధి పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి. రంగారావు మాట్లాడుతూ 14 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లలో కామేష్ పని చేశాడని తెలిపారు.

ఇతనిపై విశాఖ, తూర్పుగోదావరి, ఒడిశాలో 100కి పైగా కేసులున్నాయని ఆయన వివరించారు. 5 హత్యలు, 4 మందు పాత్రల పేలుడు కేసులో ఇతను కీలక నిందితుడు.

కాగా ఇతనిపై 4 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఇతని వద్ద నుంచి ఒక రైఫిల్, 20 రౌండ్ల బుల్లెట్లు, మూడు క్యారెజ్ మైన్లు, 50 కిలోల జిలేటిన్ స్వాధీనం చేసుకున్నామని డీఐజీ తెలిపారు.

కాలం చెల్లిన సిద్ధాంతాలతో ప్రజకు న్యాయం జరగదని అందువల్ల మావోయిస్టులు అడవులు వదిలి జన జీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు.

Related posts

ఒకరి ప్రాణం తీసిన లూడో గేమ్ గొడవ

Bhavani

ఏరియల్ వ్యూ: మేడారం జాతరకు గాలిమోటరు ప్రయాణం

Satyam NEWS

మహిళల అక్షర జ్యోతి సావిత్రిబాయి పూలే

Satyam NEWS

Leave a Comment