జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో మావోయిస్ట్ కరపత్రాలు కనిపించడం సంచలనం సృష్టిస్తున్నది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు తాము అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను మార్చుకోవాలని మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేయడం ఏ పరిణామాలకు దారితీస్తుందో అనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. మేడిగడ్డ(లక్ష్మీ బ్యారేజ్) భూ నిర్వాసితులకు అందాల్సిన భూ పరిహారాన్ని టీఆర్ఎస్ నాయకులు దిగమింగినట్టు మావోయిస్టులు తమ కరపత్రాల్లో పేర్కొన్నారు. కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ లింగంపల్లి శ్రీనివాసరావు, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మెగా కంపెనీతో ఒప్పందం చేసుకుని ఎకరాకు లక్ష రూపాయల చొప్పున కమిషన్, పంట నష్టం పరిహారం మరో లక్ష రూపాయలు ఇచ్చే విధంగా మెగా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని తరతరాలుగా రైతులు సాగుచేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కున్నారని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. భూ సేకరణకు నిరాకరించిన రైతులను పోలీస్ స్టేషన్ కు పిలిచి చిత్రహింసలు పెట్టారని వారన్నారు. అప్పటి డిఎస్పి ప్రసాదరావు రైతుల్ని చిత్రహింసలకు గురి చేయడం కూడా మావోయిస్టులు ప్రస్తావించారు. శ్రీనివాసరావు పేద రైతుల్ని మోసం చేసి కోట్లాది రూపాయలు సంపాదించి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని వారు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధు, శ్రీనివాసరావు లకు ఏ నాటికైనా ప్రజల సమక్షంలో శిక్ష తప్పదని మావోయిస్టులు పేర్కొన్నారు
previous post