36.2 C
Hyderabad
April 16, 2024 22: 49 PM
Slider తెలంగాణ

ఢిల్లీ వెళ్లొచ్చిన వాళ్లు స్వచ్ఛందంగా బయటకు రావాలి

CM KCR 041

దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంతో ముడిపడినవే ఉన్నాయి. ఢిల్లీ నుంచి తమ రాష్ట్రాలకు చేరుకున్న మర్కజ్ యాత్రికుల ద్వారా కరోనా వ్యాప్తి విస్తృతమైంది. కరోనా పరీక్షలు చేయించుకోవడానికి మర్కజ్ యాత్రికులు నిరాకరిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు.

ఇటీవల ఢిల్లీకి వెళ్లొచ్చినవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని, క్వారంటైన్ లోకి వెళ్లాలని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన మర్కజ్ యాత్రికులను ఒప్పించే బాధ్యతను మతపెద్దలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ మేరకు సీఎం కేసీఆర్ మతపెద్దలతో ఫోన్ లో మాట్లాడారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు. 85 శాతం కొత్త కేసులు ఢిల్లీ మర్కజ్ తో సంబంధమున్నవే కావడంతో తెలంగాణ అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

అందుకే యుద్ధప్రాతిపదికన మర్కజ్ యాత్రికుల కోసం 6 కరోనా నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు మూడు షిఫ్ట్ లు పనిచేసి మర్కజ్ యాత్రికుల్లో ఎవరు కరోనా పాజిటివ్, ఎవరు నెగెటివ్ అనేది తేల్చాలని సర్కారు కృతనిశ్చయంతో వుంది.

Related posts

తెలంగాణలో ప్రారంభం అయిన రాత్రి కర్ఫ్యూ

Satyam NEWS

చర్చి సేవలకు ప్రభుత్వం నెలకు రూ.5వేలు ఇవ్వాలి

Satyam NEWS

ప్రపంచ సంపన్నుడిగా మళ్లీ ఎలాన్ మస్క్

Satyam NEWS

Leave a Comment