35.2 C
Hyderabad
April 20, 2024 18: 52 PM
Slider గుంటూరు

మార్కెట్ యార్డు ఉన్నది ఎందుకో తెలుసా? అశ్లీల నృత్యాలకు…

#dance programme

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా నాయకుడు అందరికి ఆదర్శంగా ఉండాలి. అలా ఉన్నవాడే నాయకుడుగా చిరస్థాయిగా నిలిచిపోతాడు.

అలా కాకుండా అధికారం వచ్చింది కదా అని ఎలాగైనా అనుభవించేద్దాం అంటే ఇదే చివరి అవకాశం అవుతుంది. ఈ లాజిక్ తెలుసో లేదో కానీ గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఎంజాయిమెంట్ వైపే మొగ్గు చూపుతున్నారు.

ఇక్కడి స్థానిక వైసీపీ నేత పుట్టినరోజు వేడుకలు క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డు లో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు.

అలా చేయడంపైనే పలు విమర్శలు వచ్చాయి. కరోనా నిబంధనలు గాలికి వదిలేసి ఇలా చేస్తున్నారని కొందరు విమర్శించారు. అవేవీ పట్టించుకోని వైసీపీ నాయకులు మరో అడుగు ముందుకు వేసి డ్యాన్సర్లతో నృత్యాలు ఏర్పాటు చేశారు.

డ్యాన్సర్లతో చిందేయాలంటే మందు ఉండాల్సిందే కదా. ఇలా విందు, వినోదాలతో వైసీపీ నేతలు డాన్స్ పోగ్రామ్ నిర్వహించారు.

మా ఎంజాయ్ మెంట్ ముందు కరోనా ఒక లెక్కా అవన్నీ ప్రతిపక్ష పార్టీలకే తప్ప మాకేం కాదు అన్నట్లుగా వ్యవహరించారు.

వారు చెప్పినట్లే పోలీసులు చోద్యం చూశారు.

అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు.

మార్కెట్ యార్డ్ ని అశ్లీల నృత్యాలకు  ఉపయోగించటం ఏంటని స్థానిక ప్రజలు అంటున్నారు……. అధికార పార్టీ నాయకులు కదా అందుకే ఎవరూ పట్టించుకోరు…. అది అంతే.

Related posts

జీవ వ్యర్ధాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

Satyam NEWS

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్లాస్టిక్ కాలుష్యం, నియంత్రణపై పోరాటం

Bhavani

డ్రైనేజీ సమస్యను పరిష్కరించరా అంటూ స్థానిక ప్రజలు ఆవేదన

Satyam NEWS

Leave a Comment