37.2 C
Hyderabad
April 19, 2024 11: 45 AM
Slider నల్గొండ

మసీద్ పాత కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ 9 ఎలాట్మెంట్ రద్దు చేయాలి

#hujurnagar

ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మసీదు పాత కాంప్లెక్స్ 9వ,నెంబరు దుకాణం  ఇతరులకు ఎలా కేటాయిస్తారని ఇస్పెక్టర్ ను స్థానిక ముస్లిం సోదరులు నిలదీశారు. గురువారం ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక ఉస్మానియా మసీదు వక్ఫ్ పాత షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న షాపు నెంబర్ 9 కేటాయింపులో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా దుకాణం ఎలాట్ మెంట్ జారీ చేయటంలో లక్షల రూపాయలు చేతులు మారాయని కొంతమంది క్షేత్రస్థాయి వక్ఫ్ బోర్డు అధికారులు ఈ ఎలాట్మెంట్ దారుని వద్ద  ముడుపులు స్వీకరించి తప్పుడు నివేదికలను రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులకు సమర్పించి వారిని తప్పుదోవ పట్టించి వక్ఫ్ బోర్డు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు.

మసీదు కమిటీకి కాని,స్థానిక ముస్లింలకు కానీ తెలియపర్చకుండా షాపు నెంబర్ 9 ఎలా కేటాయిస్తారని వక్ఫ్ బోర్డు అధికారులను ప్రశ్నించారు. మసీదు కమిటీ ప్రమేయం లేకుండా ఏకపక్షంగా ఈ ఎలాట్మెంట్ ఎలా జారీ చేస్తారని వారు అన్నారు. ఇప్పటికే ఈ కాంప్లెక్స్ లో అనేక అక్రమాలు జరిగాయని,మరల కొంతమంది క్షేత్ర స్థాయి వక్ఫ్ బోర్డు అధికారుల వలన కొత్త వివాదాలు సృష్టిస్తున్నారని, ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డ వక్ఫ్ బోర్డు అధికారులను సస్పెండ్ చేయాలని అన్నారు.

ఇలాంటి అవకతవకలకు పాల్పడితే హుజూర్ నగర్ ముస్లిం సోదరులు చూస్తూ ఊరుకోరని,ఏ పోరాటానికైనా సిద్దమౌతామని అన్నారు. షాపు కేటాయింపుల్లో జరిగిన కుంభకోణంపై రాష్ట్రస్థాయి వక్ఫ్ బోర్డు అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపించి అవకతవకలకు పాల్పడ్డ వక్ఫ్  బోర్డు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షాపు నెంబర్ 9 పై జారీచేసిన ఎలాట్మెంట్ తక్షణమే రద్దు చేయాలని, వక్ఫ్ బోర్డు నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దరఖాస్తుల స్వీకరణ జరిగిపి అర్హులైన ముస్లిం సోదరులకు షాపు కేటాయింపు జరపాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం సోదరులు ఎండీ అజీజ్ పాషా,ఎస్ కె. మన్సూర్ అలీ,బిక్కన్ సాహెబ్, సయ్యద్.సాదిక్,ఎస్ కె.షఫీ,విుల్లు రహీమ్,జానీ నవాబ్,మున్నా, ముస్తఫా, ఎస్ కె.సైదా,జానీ పాషా,గోరే మియా, చోటా షఫీ,ఇబ్రహీం,భాషా,రషీద్ నయీమ్,రసూలు,నాగులు,మెుయిన్, గౌస్,మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

‌సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

విజ‌య‌న‌గ‌రంలో “గ‌డ‌ప గ‌డ‌ప‌కు “కార్య‌క్ర‌మం ప్రారంభం……!

Satyam NEWS

వి ఎస్ యు లో 45 రోజుల నైపుణ్యాభి వృద్ధి శిక్షణా కార్యక్రమం

Satyam NEWS

ఎక్సోడస్: వైసీపీ లోకి సతీశ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment