37.2 C
Hyderabad
March 28, 2024 21: 03 PM
Slider మెదక్

ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి

#siddipet police

ఎవరికి వారు వ్యక్తిగత శుభ్రత పాటించి కరోనా బారిన పడకుండా కాపాడుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి. జోయల్ జోయల్ డేవిస్ అన్నారు. కరోనా పోయిందని నిర్లక్ష్యం చేయవద్దని ఆయన కోరారు.

ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసిన నుండి ప్రజలందరూ మాస్కులు ధరించి కుండా భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని, మాస్కు ధరించకుండా భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యం చేసేవారు కరోనా వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

మాస్కులు లేకుండా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చాలా మంది మాస్కులు ధరించకుండానే బయటికి వస్తున్నారని, దీని కారణంగా కరోనా వ్యాప్తి పెరిగిపోయే ప్రమాదం ఉన్నదని అన్నారు. ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని లేకపోతే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

ముఖ్యంగా జిల్లా ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని, విధిగా మాస్క్ ధరించడం, చేతులు శుభ్రపర్చుకోవడం, భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనా బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు.

శుభకార్యాలు, మరణాలు లాంటి వాటికి ఎక్కువ సంఖ్యలో గుమికూడడం చేయవద్దని అన్నారు. కరోనా మన నుండి పూర్తిగా తొలగిపోలేదని, మరోపక్క థర్డ్ వేవ్ ప్రమాదం సైతం పొంచి ఉన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

మాస్క్ ధరించకుండా పబ్లిక్ లోకి వస్తే పోలీసు చలాన్, జరిమానా, కేసులు తప్పవు అని హెచ్చరించారు. కరోనా వ్యాప్తిని సమర్ధవంతంగా కట్టడి చేయడం లక్ష్యంగా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని, ప్రజలందరూ పోలీసులు యొక్క సలహాలు సూచనలు పాటించి మాస్కులు ధరించాలని షాపింగ్ మాల్ లో ఇతర మార్కెట్ల వద్ద భౌతిక దూరం పాటించాలని కమిషనర్ సూచించారు.

Related posts

కెసిఆర్ రాజకీయ చరిత్రలో అతిపెద్ద మోసం ఇది

Satyam NEWS

స్మగ్లింగ్: గన్నవరం విమానాశ్రయంలో రూ.17 కోట్ల బంగారం

Satyam NEWS

ఆంధ్రా తెలంగాణ సరిహద్దుల్లో వాహనాల తాకిడి

Satyam NEWS

Leave a Comment