30.3 C
Hyderabad
March 15, 2025 10: 03 AM
Slider నల్గొండ

మునిసిపల్ సిబ్బందికి ఆర్ఎంపిల సహకారం

#HujurnagarMunicipality

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మునిసిపల్ కార్యాలయ సిబ్బందికి RMPలు, PMPలు మాస్కులు, సబ్బులు, గ్లౌజులు అందచేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని మునిసిపాలిటీ కార్యాలయంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది.

మునిసిపల్ కమీషనర్ నాగిరెడ్డికి RMP గ్రామీణ వైద్య సంఘం అధ్యక్షుడు షేక్ మన్సూర్ అలీ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ RMP కమిటీ సభ్యుల సహకారంతో 250 గ్లౌజులు,250 మాస్కులు, లైఫ్ బాయ్ సబ్బులు అందచేశారు.     ఈ సందర్భంగా మన్సూర్ అలీ మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలకు తమ వంతుగా అవగాహన కల్పించామని అన్నారు.

ఇంటిలోనే ఉండి వ్యక్తిగత పరిశుభ్రత ప్రజలు పాటించాలని కోరారు. అనంతరం కమీషనర్ నాగిరెడ్డికి మాట్లాడుతూ మున్సిపాలిటీ సిబ్బందికి మాస్కులు, సబ్బులు, గ్లౌజులు అందచేసిన RMP, PMPలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఏఈ ప్రవీణ్ కుమార్, హుజూర్ నగర్ మండల ఆర్.ఎం.పి సంఘం ప్రధాన కార్యదర్శి సన్నిధి వెంకటేశ్వర్లు, పి.పురుషోత్తం యస్.రవికుమార్, జి.మధు, కిరణ్ ,కె.రామారావు, టి. ప్రకాష్, బి.నాగరాజు, టి.రమేష్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని గాంధీ విగ్రహం వద్ద నిరసన

Satyam NEWS

దాతృత్వం చాటుకున్నశ్యాంపిస్టన్స్ కార్మికులు

Sub Editor

కేసీఆర్ మర్చిపోయిన చిన్న లాజిక్ ఇది

Satyam NEWS

Leave a Comment