27.7 C
Hyderabad
April 25, 2024 07: 53 AM
Slider హైదరాబాద్

మెట్రో రైల్ ప్రయాణీకులకు మాస్కుల పంపిణీ

#MetroRail

కరోన వైరస్ నేపథ్యంలో గత అయిదు నెలలుగా మెట్రో రైల్ నిలిపి వేశారు. ప్రజల అవసరాల దృష్ట్యా మళ్ళీ తిరిగి మెట్రోను ప్రారంభించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దానిలో భాగంగా ఈ రోజు మెట్రో రైళ్లు మళ్ళీ పట్టాలు ఎక్కాయి. మెట్రో రైళ్లలో ప్రయాణించేవారి సంక్షేమం కోసం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచనల మేరకు కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, కొప్పుల విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి ప్రయాణికులకు మాస్కులు, శానీటీజర్స్ సరఫరా చేశారు.

మెట్రో రైలు ప్రయాణం చేయడానికి వచ్చే ప్రయాణికుల క్షేమం కోసం వారికి నియోజకవర్గ పరిధిలో ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోన వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

పరిమిత సంఖ్యలో ప్రయాణికులను మెట్రో రైల్ లో అనుమతిస్తుందని వారు తెలిపారు. ప్రతి సీటు, సీటు కు మధ్య కొంత స్థలం వదలారు. అలాగే ప్రయాణించిన ప్రతిసారి రైల్ శానిటేషన్ చేయిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క ప్రయాణికులు తమ వంతు భాగంగా భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కులు ధరించి ప్రయాణం చేయాలని కోరారు.

Related posts

9న ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలి

Satyam NEWS

టూ లేట్ : సులేమానీని ఎప్పుడో చంపాల్సింది : ట్రంప్‌

Satyam NEWS

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

Bhavani

Leave a Comment