27.7 C
Hyderabad
April 24, 2024 09: 06 AM
Slider నిజామాబాద్

రోడ్డెక్కి ముగ్గులేసిన మాస్టర్ ప్లాన్ బాధిత రైతు కుటుంబాలు

#kamareddy

మీ పిల్లల భవిష్యత్తు బంగారు మయం చేసుకోవడం కోసం మా బ్రతుకులను రోడ్డుకిడుస్తారా అంటూ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల కుటుంబాలు ముగ్గులు వేసి తమ నిరసన తెలిపారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 45 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. నేడు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇళ్లలో ముగ్గులు వేసి సంతోషంగా పండగ చేసుకోవాల్సిన మహిళలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్లపై ముగ్గులు వేసి నిరసన తెలిపారు.

సిరిసిల్ల రోడ్డు నుంచి పాత బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, కొట్టబస్టాండ్ వరకు మహిళా రైతులు, వారి పిల్లలతో కలిసి ముగ్గులు వేశారు. మాస్టర్ ప్లాన్ వద్దు.. భూతల్లి ముద్దు, కమిషనర్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ముగ్గులు వేశారు. ముగ్గులతో నిరసన సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల వెంటనే పోలీసులు ఉన్నారు. మున్సిపల్ కార్యాలయంలోకి వస్తారమోనన్న అనుమానంతో కార్యాలయ గేటును మూసివేసి పోలీసులు బండిబస్తు ఏర్పాటు చేశారు.

రైతులు ఎక్కడా ఆందోళనలు చేపట్టకుండా ముగ్గులు వేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేయాలన్నారు. లేదంటే ఈ నెల 20 లోపు విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా కౌన్సిల్ పై ఒత్తిడి తీసుకురావడానికి తమతో కలిసి రావాలని కోరారు. మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం తప్ప తమకు ఏదీ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

Related posts

మతం మారిన ముస్లిం యువతికి కుటుంబ సభ్యుల వేధింపు

Satyam NEWS

అరుదైన గ్రూప్ రక్తాన్ని దానం చేసిన స్కూలు టీచర్

Bhavani

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు జగన్ నిర్వాకం

Satyam NEWS

Leave a Comment