32.2 C
Hyderabad
April 20, 2024 19: 32 PM
Slider వరంగల్

ములుగులో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు

#MathsDay

భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి సెక్టోరల్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎస్ ఓ గారు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ అతి తక్కువ కాలంలో భారతీయ గణిత శాస్త్రానికి ఎనలేని సేవ చేశారు, త్రికోణమితి, రేఖాగణితం, కలన గణితం విభాగాలలోని ఎన్నో అపరిష్కృత సమస్యలకు సమాధానాలు రాబట్టడం జరిగింది.

20వ శతాబ్దపు ప్రపంచ గణిత శాస్త్రజ్ఞుల లో రామానుజన్ అగ్రస్థానం లో ఉంటారని చెప్పారు. ఎంతో మంది విదేశీ శాస్త్రజ్ఞులకు కూడా స్ఫూర్తి దాయకంగా నిలిచి భారతీయ గణిత శాస్త్ర కీర్తి పతాకాన్ని ప్రపంచంలో ఎగురవేశారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలోని  గణిత శాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థులలో తార్కిక విశ్లేషణ, సాధన నైపుణ్యాలను పెంపొందించాలని కోరారు.

తరగతిగది గణిత శాస్త్ర అభ్యసనం నిజజీవితంలో సమస్య సాధనకు ఉపయోగపడాలనీ , విద్యార్థికి వేగాన్ని , కచ్చితత్వాన్ని , క్రమశిక్షణ ఏర్పరచాలని కోరారు. గణితంలో వెనుకబడిన విద్యార్థుల ని గుర్తించి ప్రత్యామ్నాయ  మార్గాల ద్వారా విద్యార్థికి ఆసక్తి కలిగించే ట్లుగా బోధనలో బోధన ఉపకరణాలను ఉపయోగించి బోధన అభ్యసన ప్రక్రియ ని సులభతరం చేయాలని కోరారు. 

ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఎస్ ఆర్ జి బండారి రమేష్ చేత తరగతిగది బోధన గణిత నమూనాలు పై ఆన్లైన్ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ సి జి ఈ రమేష్, TMF అధ్యక్షులు మధుసూదన్, కార్యాలయ సిబ్బంది కిరణ్ ,నూరుద్దీన్, ఏపీవో సాంబయ్య ,స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

సొంత కూతురిపైనే అఘాయిత్యం చేసిన తండ్రి

Satyam NEWS

లేఅవుట్ లో పార్కుల ఉనికి భద్రం క్షేత్ర స్థాయిలో శూన్యం

Satyam NEWS

కాంగ్రెస్ నేతలు తెలివిలేనోళ్ళైతే బిఆరెస్ నేతలిది అతి తెలివి

Bhavani

Leave a Comment