27.7 C
Hyderabad
April 20, 2024 00: 52 AM
Slider అనంతపురం

హైటెక్ పద్ధతిలో మట్కా నిర్వహిస్తున్న ఐదుగురు అరెస్టు

tadipatri police

ముంబాయి నిర్వాహకుడితో సంబంధాలు పెట్టుకుని జిల్లాలో మట్కా కొనసాగిస్తున్న ఐదుగురు మట్కా నిర్వాహకులను గుత్తి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండీ రెండు కిలోల గంజాయి , రూ. 4,500/ నగదు, ఐదు సెల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు, ఎ.టి.ఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా… నలుగురు మట్కా నిర్వాహకులు అరెస్టు కావాల్సి ఉంది. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలుతో హైటెక్ పద్ధతిలో కొనసాగుతున్న మట్కా గుట్టు రట్టు చేసిన వివరాలను మంగళవారం తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ప్రస్తుతం అరెస్టయిన వారిలో ఖతీజ్ సయ్యద్ కరీముల్లా ముఖ్యుడు.ఇతను జిల్లా కేంద్రంలో ఓ కారు సర్వీసింగ్ సెంటర్ నడుపుతూ ఆ ముసుగులో మట్కా కూడా నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం అరెస్టయిన మిగితా వారిని, అరెస్టు కావాల్సిన వారిని కలుపుకుని గుత్తి, గుంతకల్లు, అనంతపురం ప్రాంతాల్లో ఉన్న మట్కా బీటర్ల నుండీ లావాదేవీలు కొనసాగిస్తున్నాడు. మట్కా నంబర్ తగిలితే రూపాయికు రూ 80 లేదా రూ. 90 ఇస్తామంటూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. బీటర్లకు 20 శాతం వరకు కమీషన్ ఇస్తున్నాడు. ప్రతీ రోజూ సేకరించిన మట్కా వ్యవహారాలను ఏరోజుకారోజు ముంబాయిలో ఉన్న ఓ మట్కా డాన్ కు పంపుతున్నాడు. హైటెక్ పద్ధతిలో వాట్సాప్ ద్వారా ఇలా మట్కా నిర్వహిస్తున్నాడు. ఈ మట్కా వ్యవహారానికి సంబంధించి బ్యాంకు లావాదేవీలు కూడా కొనసాగిస్తున్నారు. ఇతనిపై స్థానిక మూడవ పట్టణ, రెండవ పట్టణ పోలీసు స్టేషన్లలో మట్కా కేసులున్నాయి. గంజాయి విక్రయాలు కూడా నిర్వహిస్తున్నారు. వీరందరిపైన కేసులు ఉన్నాయి అని పోలీసులు తెలిపారు.

Related posts

ప్రభుత్వ ఉద్యోగులూ… కంగారు వద్దు అన్ని చర్యలు తీసుకుంటున్నాం

Satyam NEWS

కల్యాణమస్తు జంటలకు 2 గ్రాముల బంగారు తాళిబొట్లు

Satyam NEWS

మూసి పరివాహక ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన

Satyam NEWS

Leave a Comment