39.2 C
Hyderabad
April 25, 2024 16: 52 PM
Slider కృష్ణ

ఎన్టీఆర్ ట్రస్ట్ నీడలో మౌనంగా ఎదిగిన మౌనిక

#NTR Trust

ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఓ విద్యార్థిని శింగనమల, గార్లదిన్నెలో యువగళం క్యాంప్ సైట్ వద్ద యువనేత నారా లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. తండ్రి చనిపోయిన తనను, తన కుటుంబాన్ని తెలుగుదేశంపార్టీ, నారా చంద్రబాబు నాయుడు ఆదుకున్నారని వివరించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల తన సోదరి, తాను ఉన్నత స్థానానికి చేరుకున్నామని పేర్కొంది.

యువతి చెప్పిన మాటలకు నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. మరింత ఉన్నత స్థాయికి చేరుకుని, పదిమందికి దారిచూపేలా ఆలోచించాలని కోరారు. అనంతపురంజిల్లా, బుక్కరాయసముద్రం మండలం, కేకే అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ను ప్రత్యర్థులు 2005లో దారుణంగా హత్యకు గురయ్యారు. ఇతనికి నలుగురు ఆడపిల్లలు. వారిలో మూడవ కూతురు నాగమణి, నాల్గవ కూతురు మౌనికను తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదివించారు.

నాగమణి, మౌనిక ఎన్టీఆర్ ట్రస్ట్ లోనే చదువుకున్నారు. ఉన్నత విద్యను కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సహకారంతో పూర్తిచేశారు. నాగమణి ఎన్టీఆర్ ట్రస్ట్ లోనే చదువుకుని హైదరాబాద్ లోని వివిడ్ మైండ్స్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. మౌనిక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చదివి నేడు ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశారు. వీళ్ల బాబయ్ కొడుకు వెంకటేష్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చదివి బెంగళూరులోని క్రిక్ బజ్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ స్థిరపడ్డారు. తమ కుటుంబాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉన్నత స్థానానికి వెళ్లాయని చెప్పి, కృతజ్ఞతలు చెప్పేందుకు యువనేత నారా లోకేష్ ను కలిశానని మౌనిక వివరించింది.

Related posts

సవాళ్ళకు సమాధానం లేని బడ్జెట్‌

Murali Krishna

పేరుకు పార్ట్ టైం పని ఫుల్ టైం జీతాలు మాత్రం హాఫ్ టైం

Satyam NEWS

ములుగు జిల్లాలో రెండో దశ కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment