32.2 C
Hyderabad
April 20, 2024 20: 39 PM
Slider ముఖ్యంశాలు

టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక, శ్రామిక,కర్షక పక్షపాతి

#saidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా టిఆర్ఎస్కెవి ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ,ర్యాలీలో పాల్గొన్నారు.

హుజూర్ నగర్ పట్టణంలో ఆదివారం టిఆర్ఎస్ కెవి కార్మిక విభాగ నాయకుడు పచ్చిపాల ఉపేందర్ ఆధ్వర్యంలో స్థానిక మునిసిపల్ కార్యాలయ ఆవరణములో గల ఆటో వర్కర్స్ యూనియన్ అడ్డ వద్ద జెండా ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ శ్రామిక శక్తి యొక్క గౌరవాన్ని,విలువను మేడే చాటి చెబుతుందని,ప్రపంచంలో శ్రామికుల పని ఒత్తిడి,శ్రమ దోపిడీ మీద ఎలుగెత్తిన శ్రామిక విప్లవానికి ప్రతీకగా మేడే నిలుస్తుందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కార్మిక పక్ష పాతిగా,శ్రామిక బంధుగా,ఉద్యోగ,కార్మిక,కర్షక సంక్షేమమే ద్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కెసిఆర్  నాయకత్వంలో పని చేస్తుందని అన్నారు.హుజుర్ నగర్ పట్టణంలో ఇటీవలే మంజూరైన ఈ ఎస్ ఐ హాస్పిటల్ త్వరలోనే పని చేస్తుందని, కార్మికులకు,ఉద్యోగులకు మంచి సేవలు ఎల్లప్పుడూ ముగ్గురు  డాక్టర్ల తో 24 గంటలు సేవకు సిద్ధంగా ఉంటుందని, రాష్ట్రంలో మొదటిగా హుజూర్ నగర్ లోనే ప్రారంభం కానుందని అన్నారు. ఇదే హాస్పిటల్ లో త్వరలోనే డయాగ్నొస్టిక్  సెంటర్ కూడా ప్రారంభం అవుతుంది అని తెలిపారు.

పేద ప్రజల గుండె చప్పుడు తెలిసిన నాయకుడు కెసిఆర్ అని,అందుకనే తెలంగాణ వచ్చిన తరువాత  ఆశ,అంగన్వాడీ,విఓఎ,అందరి ఉద్యోగులకు గణనీయంగా జీతాలు పెంచారని,దేశంలోనే అత్యంత ఎక్కువ జీతాలు పోతుందుతున్న రాష్ట్రం కేవలం తెలంగాణ అని అన్నారు.

పక్క రాష్ట్రాల కార్మికులను మనం కడుపులో దాచుకోవాలని,ఒరిస్సా,బీహార్,ఇతర రాష్ట్రాలు నుండి వచ్చి మన హుజూర్ నగర్ రైస్ మిల్లులు,ఇతర ప్రాంతాలలో రాష్ట్ర మంతటా వారు పని చేసుకుంటూ సేవలందిస్తూ రాష్ట్ర ప్రగతిలో వారి భాగస్వామ్యం పంచుకుంటున్నారని, అలాంటి కార్మికులను టిఆర్ఎస్కెవి నాయకులు ఎల్లప్పుడు కంటికి రెప్పలా కాపాడుకోవాలని,వారు యాజమాన్యం నుంచి పడే ఇబ్బందులను,సమస్యలను పరిష్కరించాలని,అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని సైదిరెడ్డి అన్నారు.దురదృష్టవశాత్తు కార్మికులు మరణిస్తే 6 లక్షల వరకు ఇస్యూరెన్స్ ఇచ్చి వారి కుటుంబాలను టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.

అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు టిఆర్ఎస్కెవి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ కార్మిక శక్తి,స్థానిక శక్తి ఉద్యోగులు,ఆశ, అంగన్వాడి,ఐకెపి కార్యకర్తలు, వ్యవసాయ కూలీలు,శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి వెంట బహిరంగ, ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కెవి కార్మిక సంఘ నాయకుడు పచ్చిపాల ఉపేందర్,రైస్ మిల్ యూనియన్ చాలవాది సైదులు,పట్టణ టిఆర్ఎస్ కెవి నాయకులు చింతకాయల మల్లయ్య, మున్సిపల్ యూనియన్ లతీఫ్,ఆర్పి యూనియన్ శ్రీదేవి,విఓఎ యూనియన్ సునీత,రమాదేవి,శైలజ,సైదమ్మ,గిరిజ, లైట్ మోటర్ యూనియన్ షరీఫ్,నగులమీరా, వెంకట్,నగేష్,రాకేష్, తెప్పని,పండ్ల కొట్టు యూనియన్ నాగేందర్,ఉస్మాన్,వెలిదండ ఆటో యూనియన్ నాగేశ్వరరావు,మెడికల్ యూనియన్ తులసి,ప్రమీల,లారీ అసోసియేషన్,వెంకన్న,ట్రాలీ యూనియన్ గోపయ్య,హుజుర్ నగర్ పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అమర్నాధ్ రెడ్డి,మున్సిపల్ చెర్మెన్ గెల్లి అర్చన రవి,వైస్ చెర్మెన్ జక్కుల నాగేశ్వర రావు,ఫణికుమారి,దొంగరి మంగమ్మ వీరారెడ్డి,జక్కుల శంభయ్య,గంగరాజు, ఎడ్ల విజయ్,జె ఎస్ డి,కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

పొగిడించుకోవడం తప్ప ఈ ప్లీనరీలో ఏముంది?

Satyam NEWS

తొలి రోజే జగన్‌ రెడ్డి ప్రభుత్వంపై పురందరేశ్వరి ఘాటైన విమర్శలు

Satyam NEWS

వెల్దుర్తి శ్రీ హనుమాన్ జంక్షన్లో హనుమాన్ దీక్ష రజతోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment