మేడారం మహాజాతర తేదీలను మేడారం జాతర పూజారుల సంఘం ఖరారు చేసింది. పూజారుల సంఘం ఖరారు చేసిన ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ బుధవారంనాడు సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఆ తర్వాతి రోజు అంటే ఫిబ్రవరి 6న గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుతుంది. 7వ తేదీ శుక్రవారం నాడు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 8వ తేదీన దేవతల వన ప్రవేశం ఉంటుంది. మేడారం మహా జాతరకు వైభవంగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులు పలు దఫాలుగా సమావేశం అయి తీసుకోవాల్సిన ఏర్పాట్ల పై సమీక్ష కూడా జరిపారు. మేడారం జాతర కు తెలంగాణ లోని జిల్లాల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర ల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.
previous post