28.7 C
Hyderabad
April 20, 2024 03: 23 AM
Slider ప్రత్యేకం

మేడారం జాతర పనులకు ప్రతిపాదనలు వెంటనే పంపండి

#satyavathi

మేడారం శ్రీ సమ్మక్క- సారలమ్మ వచ్చే ఏడాది జాతర పనుల కోసం ప్రతిపాదనలు అందజేయాలని రాష్ట్ర గిరిజన అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ గతంలో నిర్వహించిన మేడారం జాతరను దృష్టిలో పెట్టుకొని అత్యధిక సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు.

రామప్పగుడి  అభివృద్ధి పనులకు ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో గత వారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమావేశం నిర్వహించి పనులను గుర్తించారని తెలిపారు. రామప్ప పరిసర ప్రాంతాల్లో తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ కు ఉన్న 23 ఎకరాల స్థలం లో నుంచి కొంత భాగంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉపయోగించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

రామప్ప అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నoదున రామప్ప చెరువులో ఐలాండ్ నిర్మాణం, వాటర్ స్పోర్ట్స్, సమాచార కేంద్రం, టూరిజం విలేజ్ ఏర్పాటు తదితర ఏర్పాట్లు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా  కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని మరో 40 వేల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ చేయాల్సి ఉందని దానిని వారం రోజుల్లో పూర్తి చేస్తామని వివరించారు.

ఫిబ్రవరి 16 నుంచి నాలుగు రోజుల జాతర మొదలు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2022 ఫిబ్రవరి 16, 17, 18, 19 తేదీలలో నాలుగు రోజులు జరుపుకునేందుకు ఆలయ పూజారులు నిర్ణయించారని తెలిపారు. మేడారానికి దారి తీసే అన్ని వైపుల నుండి ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖల ద్వారా గుర్తించిన రహదారుల మరమ్మతు పనులు, వర్షాలతో దెబ్బతిన్న రహదారుల నిర్మాణ పనుల కోసం ప్రతిపాదనలు అందించాలని అదేవిధంగా అధిక వర్షాలతో దెబ్బతిన్న జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రహదారులు, వంతెనల మరమ్మతుల కొరకు ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించాలని అన్నారు.

జాతర సమయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అదనంగా త్రాగునీరు, వసతి, విద్యుత్తు, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించేందుకు తాత్కాలికంగా మరియు శాశ్వత పద్ధతిలో ప్రతిపాదనలు పంపించాలని, దేవాదాయశాఖ ద్వారా చేపట్టిన భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలని, జంపన్న వాగు వద్ద నీటి ప్రవాహంతో ప్రమాదాలు జరగకుండా జంపన్న వాగు అభివృద్ధి పనులు ఇరిగేషన్ శాఖ ద్వారా చేపట్టాలని కోరారు. స్నాన ఘట్టాలు డ్రెస్ చేంజింగ్ రూమ్ లను నిర్మించాలని, జల్లు స్నానాలకు బ్యాటరీ అప్ టాప్ లను ఏర్పాటు చేయాలని, వాగులో గల బావులలో ఇసుక పూడిక తీయాలని అన్నారు.

ఆరోగ్య శాఖ మెరుగైన ఏర్పాట్లు చేయాలి

జాతర సమయంలో పారిశుద్ధ పనుల్లో లోపం కలగకుండా ముందస్తుగా కార్యాచరణ రూపొందించుకోవాలని పంచాయతీ అధికారులను, కోవిడ్ నేపథ్యంలో  భక్తులకు అవసరమైన వైద్య సేవలను అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, గిరిజన సాంప్రదాయాలకు విఘాతం కలగకుండా ఆలయ పూజారులతో సమన్వయం చేసుకొని ఆలయ పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు.

జిల్లా ఎస్పి సంగ్రామ్ సింగ్ పాటిల్ మాట్లాడుతూ మేడారంలో జాతర సందర్భంగా పోలీస్ శాఖ వారికి శాశ్వత ఆవాసం లేకపోవడం మూలంగా వర్షాలు కురిసిన సమయంలో అనేక ఇబ్బంది కలుగుతుందని పోలీస్ శాఖకు మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సమావేశంలో ములుగు ఏఎస్పి సాయి చైతన్య, జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మాకిడి ఎర్రయ్య, మేడారం ఆలయ కార్యనిర్వాహక అధికారి రాజేందర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్. అప్పయ్య, ఏటూరునాగారం ఐటిడిఎ ఏపీవో (జనరల్) వసంతరావు, ఇఇ ఆర్డబ్ల్యూఎస్ బి.మణిక్యరావు, పంచాయతీరాజ్ ఇఇ రాంబాబు,టీఎస్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాస్కర్, అగ్నిమాపక శాఖ అధికారి బి. మల్లికార్జున యాదవ్, టూరిజమ్ అధికారి శివాజీ, ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ హేమలత, విద్యుత్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్రైస్తవులకు షబ్బీర్ అలీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Satyam NEWS

కరోనా మరణాలపై చైనా తప్పుడు లెక్కలు

Satyam NEWS

జూన్ 4న‌ సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment