36.2 C
Hyderabad
April 25, 2024 22: 56 PM
Slider హైదరాబాద్

మజ్లీస్ కోసం మునిసిపల్ చట్టంలో మార్పులు

#MedchalBJP

నూతన మున్సిపల్ చట్టంపై టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  పిలుపు మేరకు బిజెపి మేడ్చల్ (అర్బన్) జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి నిరసన కార్యక్రమం జరిగింది.

భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బిజెపి, బిజెవైయం నేతలు అసెంబ్లీ ముట్టడించేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేసి అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా బాలాజీ నగర్ 115 డివిజన్ బిజెపి అధ్యక్షుడు వినోద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నూతన మున్సిపల్ చట్టంలో ఇద్దరు పిల్లలు అనే  నిబంధనను తీసివేయాలని కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి పూర్తిగా వ్యతిరేకిస్తుందని, ఇది మజ్లీస్ పార్టీ వత్తిడి మేరకే చేశారని ఆయన అన్నారు.

అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై బిజెపి పోరు కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి బిజెపి బిజెవైయం, మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Related posts

పులివెందుల భూకబ్జాలపై తిరగబడ్డ ప్రజలు

Satyam NEWS

చీమలపాడు గ్రామస్థుల ఆందోళన

Bhavani

ఉయ్ ఆర్ రెడీ: లాక్ డౌన్ కు విశాఖపట్నం జిల్లా సన్నద్ధం

Satyam NEWS

Leave a Comment