27.7 C
Hyderabad
March 29, 2024 02: 47 AM
Slider ముఖ్యంశాలు

కరోనా బారిన పడిన జర్నలిస్టులకు అకాడమీ సాయం

#Allam Narayana

రాష్ట్రంలో ఇప్పటి వరకు  కరోన వైరస్ బారిన పడిన  262 మంది జర్నలిస్టులకు 44 లక్షల 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. వీరిలో  పాజిటివ్ వచ్చిన185 మంది జర్నలిస్టులకు ఇరవై వేల రూపాయల చొప్పున,37లక్షల రూపాయలు,హోం క్వారంటైన్ లో ఉన్న77 మంది జర్నలిస్టులకు పదివేల రూపాయల చొప్పున 7లక్షల 70 వేల రూపాయలను అందిచామని తెలిపారు.

మొత్తంగా అందరికీ 44లక్షల70వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. గురువారం నాటికి వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా తాజాగా 36 మందికి పాజిటివ్ వచ్చిందని, మరో 5మంది జర్నలిస్టులు హోంక్వారంటైన్ లో ఉండవలసిందిగా వైద్యాధికారులు సూచించారని తెలిపారు.

ఈ 41 మంది జర్నలిస్టులకు 7 లక్షల 70 వేల రూపాయలు ఆర్థిక సహాయం జర్నలిస్టుల ఆన్లైన్ ఎకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు. జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ 8096677444 నెంబర్ కి పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు  మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్ కుమార్  సెల్ నెంబర్  9676647807 ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

కరోనా బారిన పడిన పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులు మీడియా అకాడమీ కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.

Related posts

పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికలు సక్రమంగా జరిగేనా?

Satyam NEWS

40 వేల దిగువకు కోవిడ్‌-19 కొత్త కేసులు

Sub Editor

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి సేవలో శ్రీలంక ప్రధాని

Satyam NEWS

Leave a Comment