36.2 C
Hyderabad
April 25, 2024 19: 59 PM
Slider ప్రత్యేకం

మీడియా కట్: సాక్షి ఉంటే చాలు మీరంతా మాకెందుకు?

sakshi

దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం మీడియా పట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక, సాక్షి టివి ప్రతినిధులను మాత్రమే అనుమతించిన జిల్లా యంత్రాంగం మిగిలిన మీడియాకు నో చెప్పింది.

సాక్షి పత్రిక, సాక్షి టివి ఉంటే చాలు మిగిలిన మీడియా మాకెందుకు అన్న రీతిలో ప్రవర్తించి ముఖ్యమంత్రి వద్ద మితిమీరిన స్వామి భక్తిని ప్రదర్శించారు. రాజమండ్రి లో మీడియా పట్ల అధికారులు చూపిన వివక్ష తీవ్ర విమర్శలకు తెరతీసింది. రాజమండ్రి లో మొత్తం గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులు దాదాపుగా 80 మంది ఉంటారు. వీరందరికి ప్రభుత్వం తరపున ఏ కార్యక్రమం జరిగినా ఆహ్వానం వస్తుంది.

అయితే ఈ సారి మాత్రం పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఒకే ఒక్క సాక్షిని పిలిచారు. బహిరంగ సభ వేదిక వద్దకు కేవలం కొందరు పత్రికా విలేకరులను మాత్రమే అనుమతించారు. ఫొటోగ్రాఫర్లు, కెమెరా మెన్ లను అనుమతించలేదు. రాజమండ్రి లో ప్రధానంగా ఉండే స్థానిక పత్రికలను అసలు అనుమతించలేదు.

ఇదే మని ప్రశ్నిస్తే స్థలం లేదు అందుకోసమే అనుమతించలేదు అని అధికారులు చెబుతున్నారు. అయితే సాక్షి వారికి మాత్రం చాలినంత స్థలం ఉండటమే విచిత్రం. మీడియా పట్ల అధికారులు చూపిన ఈ వివక్షను ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఎం. శ్రీరామమూర్తి తీవ్రంగా ఖండించారు. స్థానిక దినపత్రికలు, కెమెరామెన్లు, ఫొటో గ్రాఫర్లకు సిఎం జగన్ పర్యటన మీడియా కవరేజ్ పాస్ లు జారీ చేయలేదు.

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సబ్ కలెక్టరు పేరుతో పాస్ లు జారీచేసినప్పటికీ ఆంక్షలు విధించారు. దిశ మహిళా పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవం కవరేజ్ కు అనుమతి లేదని, నేరుగా నన్నయ్య యూనివర్సిటీ లో జరిగే దిశ సభకు మాత్రమే హాజరవ్వాలని సమాచార , పౌర సంబంధాల శాఖ అధికారుల చేత హుకుం జారీ చేయించడం శోచనీయం.

తొలిసారిగా సిఎం పర్యటనలో మీడియా ఆంక్షలు విధించి కొందరికి పాస్ లు జారీ చేసి మరికొందరికి చేయకపోవడం, చిన్న పత్రికలు అని విడదీయం పట్ల  నిరసన తెలుపుతున్నాం. రాష్ట్ర వ్యాప్త దిశ చట్టం పోగ్రామ్ సిఎం చేతులు మీదుగా జరుగుతున్న నేపధ్యంలో మీడియా పట్ల జిల్లా, సమాచార శాఖ అధికారులు వ్యవహరించిన తీరును నిరసిస్తున్నాం.

ఇది మీడియా గొంతునొక్కడమే అవుతుంది. ఈ విషయంలో సంబంధిత అధికారుల తీరును తీవ్రంగా ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఎం. శ్రీరామమూర్తి తీవ్రంగా ఖండించారు. మీడియా పై ఆంక్షలు విధించిన అంశాన్ని నిరసిస్తూ మీడియా ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు , రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల దృష్టి కి తీసుకువెళ్ళారు. 

కొందరికే మీడియా పాస్ లు జారీ చేసి, కొందరిని ఇగ్నోర్ చేయడం పొరపాటు అని, జిల్లా అధికారుల చేసిన తప్పు కు విచారం వ్యక్తం చేస్తున్నామని, ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే రాజా హామీ ఇచ్చారు.

Related posts

మీడియా రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి

Satyam NEWS

ఆడపిల్లకు జన్మనిచ్చిన అలియా భట్

Satyam NEWS

మోటివేషన్ ట్రైనర్ గా బిచ్కుంద వాసి

Satyam NEWS

Leave a Comment