27.7 C
Hyderabad
April 20, 2024 01: 51 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

మీడియాకు కల్కీ భగవాన్ పై దాడుల వార్తే ముఖ్యమా?

ammabhagavan

గత నాలుగు రోజులుగా మీడియాలో కల్కీ భగవాన్ ఆశ్రమంపై ఆదాయపు శాఖ అధికారుల దాడులపై వస్తున్న వార్తలపై ఆశ్రమానికి చెందిన ఒక బాధ్యుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన స్పందనను సత్యం న్యూస్ తో పంచుకున్నారు. కల్కీ ఆశ్రమం హిందూ ధర్మానికి చేస్తున్న సేవల గురించి ఏ రోజూ నాలుగు మంచి మాటలు రాయని మీడియా ఆదాయపు పన్ను శాఖ దాడుల గురించి మాత్రం పుంఖాను పుంఖాలుగా రాస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన స్పందన యధాతధంగా: గత నాలుగు రోజులుగా ఐటీ దాడులకు సంబంధించి నటువంటి దుష్ప్రచారాలు మీడియా అంతా హోరెత్తించారు. ఐటీ వారికి మీడియా వారికి ఒకటే ప్రశ్న ఏం కేవలం హిందూ ధర్మం మీదనే ఈ ఐటీ దాడులా? క్రైస్తవులు కోట్ల రూపాయలతో చర్చిలు కట్టడం లేదా?దేశం అంతటా సభలు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి ప్రచారం చేయడం లేదా ? మరి వారిపై ఎందుకు ఐటీ వారు దాడులు  చేయడం లేదు? హిందూ గురువులు, ఆలయాలే దొరికాయా?

ఇది హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి మతోన్మాదులు చేస్తున్న కుట్ర. భారత దేశాన్ని హిందూ మత ధర్మాన్ని హిందూ ధర్మాన్నినాశనం చేస్తున్నారు. కల్కిధర్మం వచ్చిన తర్వాత హిందూ ధర్మం నిలబడింది. హోమాలు పూజలతో మనిషి లోపల హిందుత్వాన్ని, సాంప్రదాయాలను, ఉన్నత విలువలను నిలబెడుతుంది కల్కి ధర్మం. ఈ ధర్మంలో కి వచ్చిన యువత అంతా తల్లిదండ్రులకి గౌరవించడం ప్రేమగా చూసుకోవడం నేర్చుకున్నారు.

ఎందరో జీవితాలలో అద్భుతాలు జరుగుతున్నాయి అనుగ్రహం వస్తుంది. ప్రతిరోజు శ్రీ అమ్మ భగవాన్ సేవాసమితి పేరు మీద అన్నదాన కార్యక్రమాలు స్వచ్ఛభారత్ కార్యక్రమాలు మొక్కలు నాటడం అనే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఆ ఫోటోలను గ్రూపులలో చూస్తూనే ఉన్నారు. ఈ సేవా సమితి కార్యక్రమాలకు ఎన్నో కోట్లు ఖర్చు అయి ఉండొచ్చు అది ఎవరికీ తెలియడం లేదా?

శ్రీ అమ్మ భగవాన్ సేవ సమితి చేస్తున్నటువంటి ఎన్నో సేవలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ప్రతి నెల శతభిష నక్షత్రం రోహిణి నక్షత్రానికి అన్నదానాలు జరుగుతున్నాయి ఈ ఫోటోలను టెలిగ్రామ్ గ్రూప్ లో చూస్తున్నారు అన్ని చోట్ల చూస్తున్నారు కానీ దాని పట్ల స్పందన లేదు కేవలం చెడు ప్రచారాలు పట్ల మాత్రమే స్పందిస్తున్నారు. మీడియా మారదు. మీడియా మీడియా అంటేనే నెగిటివ్. ఈ నెగిటివ్ నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవాలి.

ఈ మీడియా ఇచ్చే దుష్ప్రచారం నుంచి వారిని వారే కాపాడుకోవాలి. దేనికి సంబంధించిన ఎటువంటి చెడు ప్రచారాలను విన్న ఆ చెడు ప్రసారం చూడటం వల్ల వినడం వల్ల నమ్మడం వల్ల మనసు , జీవితాన్ని చెడు ఘటనలకు ప్రభావితం చేస్తుంది. అమెరికాలో ఒక సర్వే చేసారు .ఒక అబ్బాయిని కంటిన్యూగా చెడు ప్రచారాలు చేసేటటువంటి ఛానల్ ముందు కూర్చోబెట్టారు.

దాదాపు 6 గంటల సేపు చూపించారు. మరొక  అబ్బాయికి అన్ని మంచి ప్రసారాలను చూపించారు. ఆరు నెలల తర్వాత చెడు ప్రసారాలను చూసినటువంటి అబ్బాయికి మైండ్ లో చురుకుదనం తగ్గి చదువులో వెనుకబడి పోయాడు. అంతేకాదు అబ్బాయిలో హింసాప్రవృత్తి కూడా పెరిగిపోయింది. మంచి ప్రసారాలను చూసిన అబ్బాయి అన్నింటిలో విజయవంతంగా ఉండడం ప్రారంభించాడు. మంచితనము పెరిగింది. ఇది పెద్ద వారికైనా చిన్న వారికైనా ఆ మనస్సు యొక్క ప్రభావము ఇదే విధంగా చూపిస్తుంది కాబట్టి ప్రజలందరూ మీడియా అనే ఈ రావణాసురుడు పట్ల అప్రమత్తంగా ఉండండి.

Related posts

త్రికూటాద్రి లో మార్మోగుతున్న”ఓం నమః శివాయ”మంత్రం

Satyam NEWS

రాజకీయాల గతిని మార్చిన నందమూరి తారక రామారావు

Satyam NEWS

విద్యార్థులు విషయ పరిజ్ఞానాన్ని శోధించి సాధించాలి

Satyam NEWS

Leave a Comment