33.2 C
Hyderabad
April 26, 2024 02: 24 AM
Slider వరంగల్

నూటికి నూరు శాతం పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు

Medical Camp

గర్భిణి స్త్రీలను, పిల్లలను సంరక్షించడంలో ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. నేడు ఆయన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని నందిపాడు గుత్తికోయ  గ్రామాన్ని సందర్శించారు.

అక్కడ నిర్వహించిన మెడికల్ క్యాంపు లో 52ని పరీక్షించి వారికి కావలసిన మందులను ఇచ్చారు. అక్కడ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. పిల్లలకు అందుతున్న వ్యాధి నిరోధక టీకాలు వివరాలను  అడిగి తెలుసుకుని, ప్రతి ఒక్క పిల్లవానికి అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు అందేవిధంగా చూసుకోవాలని ఆదేశించారు.

 మాతా శిశు సంరక్షణ  కార్డు లోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి సూచనలు చేశారు.  ఇప్పటి వరకు పిల్లలకు అందాల్సిన వ్యాధుల టీకాలు పూర్తిగా అందినట్లు ఆయన గుర్తించారు. అనంతరం అక్కడికి వచ్చిన ముగ్గురు గర్భిణీ స్త్రీలను పరీక్షించి, అందులో ఇద్దరికీ రక్తహీనతతో ఉన్నట్టు వారిని వెంటనే ఏరియా హాస్పిటల్ కు రెఫర్ చేయాలని అక్కడ ఆరోగ్య సిబ్బందికి సూచించారు.

కోవిడ్ నియంత్రణ తప్పకుండా పాటించాలని అక్కడ ఉన్న ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్త ఫాతిమా ఆశా కార్యకర్తలు ఇందిరా షాహిద్ ఆ పాల్గొన్నారు.

Related posts

మలబార్ గోల్డ్ & డైమండ్స్  షోరూంలో ఆర్టిస్ట్రీ – బ్రాండెడ్ జ్యువలరీ ప్రదర్శన

Satyam NEWS

Analysis: రూపాయీ, ఇక లే, కరోనాను వదిలించుకో

Satyam NEWS

యజ్ఞానికి ఎవరైనా రావచ్చు

Bhavani

Leave a Comment