28.7 C
Hyderabad
April 25, 2024 05: 39 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి నాలుగవ వార్డులో ఉచిత మెగా వైద్య శిబిరం

#medicalcamp

వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీధర్, కమిషనర్ మ హేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.కృష్ణ, 4వ వార్డు కౌన్సిలర్  పద్మా-పరుశురాం వనపర్తి పట్టణంలోని 4వ వార్డులో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వనపర్తిలోని 4వ వార్డు జమ్మిచెట్టు దగ్గర మైత్రి మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో  వార్డు కౌన్సిలర్ పద్మా-పరుశురాం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జ్యోతి రావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిరుపేద ప్రజలకు ఉచితంగా వై ద్య సేవలు అందించాలన్న సంకల్పంతోనే ఉచిత  వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని చెప్పారు.అనుభవజ్ఞులైన వైద్యులు గుండె, కిడ్నీ, మధుమేహం, బీపీ, న్యూరో, గ్యాస్ర్టో, ఆర్థోపెడిక్‌, షుగర్,  పిడియాట్రిక్‌, కీళ్లనొప్పులు తదితర వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. ప్రముఖ వైద్యులు  పగిడాల శ్రీనివాస్ రెడ్డి, దొర బాబు, చాంద్ పాషా, శ్రీనివాస్ గౌడ్, పృద్వి రాజ్ గౌడ్, ప్రణీత  వైద్యులతో కూడిన బృందం సుమారు 400 మందికిపైగా పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు.

అలాగే ఉచిత వైద్య సేవలు అందించిన  డాక్టర్లను నాయకులు శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కుమార స్వామి, ,  కౌన్సిలర్ పుట్టపాకల మహేష్, బచ్చు రాము, రాజశేఖర్, శ్రీశైలం, రవి సాగర్, రమేష్, యువకులు రాము, పవన్, దుర్గేష్, చిన్నా, చింటూ, శివ పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

ములుగు జిల్లాలో ఉపాధి హామీ నిధులతో పక్కా రోడ్లు

Satyam NEWS

సీఎం జగన్‌ నీ పనైపోయింది

Bhavani

మహబుబ్ నగర్ లో అధునిక కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబ్

Satyam NEWS

Leave a Comment