27.7 C
Hyderabad
April 25, 2024 07: 59 AM
Slider ముఖ్యంశాలు

పేదోడి ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదు…

#nagarjuna

పేద ప్రజలు వైద్యం కోసం వెళ్ళేది జిల్లా పెద్దాసుపత్రికే.  అలాంటి ఆసుపత్రిలో వైద్యుల కొరత, వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉండటం శోచనీయమన్నారు..విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున.  ప్రభుత్వాలు ప్రజలకు అందించే కనీస  సదుపాయాలలో ముఖ్యమైనవి విద్య, వైద్యమని ఈ ప్రభుత్వ విధాన  లోపం వలనే విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, దానికి నిదర్శనమే ఇటీవల విడుదలైన పదవతరగతి పరీక్ష ఫలితాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున అన్నారు. ఇప్పుడు వైద్య వవ్యస్థను కూడా అధోగతిపాలు చేసి పేదవారికి సరైన వైద్యం అందించలేని దౌర్భాగ్య పరిస్థిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు.

ఇదే విజయనగరం మహారాజ ఆసుపత్రికి  గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అవార్డులు వచ్చేవి, ఇప్పుడు కనీసం రోగులకు వైద్యం అందించలేని స్థితికి తీసుకువచ్చిన పాలకులను ఏమనాలి?  అంటూ ప్రశ్నించారు.

పేదవారు ఆసుపత్రికి వెళ్తే వైద్య ఖర్చులు ఎక్కువ  అయ్యే న్యూరాలజి, కార్డియాలజీ, కిడ్నీ, కేన్సర్ వంటి వాటికి వైద్యులు లేరు, మందులు లేవు, పరికరాలు లేవని దుయ్యబట్టారు.. ఇలాంటి వ్యాధులకు పేద వారు ప్రైవేట్ ఆసుపత్రిలకు వెళ్లి చికిత్స చేయించుకోగలరా?  ఆసుపత్రి నిర్వహణ విషయంలోనూ బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తుందోని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున విమర్శించారు.

అందరితో సమానంగా పేదవారికి కూడా సకాలంలో  నాణ్యమైన వైద్యం అందించే భాద్యత ఈ ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నిస్తున్నామన్నారు. అత్యవసర సేవల కోసం జిల్లా ఆసుపత్రిలోనే చికిత్స దొరకకపోతే రోగులు ఎక్కడికి వెళ్ళాలి, అధిక డబ్బులు ఖర్చు చేసుకునే స్థోమత లేని పేదవారు విశాఖ కెజిహెచ్ కు వెళ్లే సమయం ఉండటం లేదని కిమిడి నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. అంటే పేదవారి ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదా?  పేదవారికి ఈ ప్రభుత్వం ఇచ్చే భరోసా ఇదేనా?  అని ప్రశ్నించారు.

నాసిరకం మద్యాన్ని ప్రభుత్వమే నేరుగా మార్కెట్లో అమ్ముతూ పేదప్రజల ఆరోగ్యాలను ఛిద్రం చేస్తుందోని వాపోయారు. రహదారుల నిర్వహణ లేమితో గుంతలు గుంతలుగా  ఉన్న రహదారులు వలన ప్రమాదాలు జరిగడానికి కారణం ఈ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ఈ కారణాల వలన బాధితులవుతున్న ప్రజలకు కనీసం వైద్యం కూడా అందించలేని స్థితిలో ఈ పాలకులు ఉన్నారని నాగార్జున విమర్శించారు.

దీనికి తోడు రాబోయేది వర్షాకాలం, ఈ కాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు జిల్లా ఆసుపత్రిలో పేదప్రజల కోసం అన్ని విభాగాలలో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు.అలాగే మందులు  వైద్య పరికరాల కొరత లేకుండా చూసి పేదప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని విజయనగరం టీడీపీ జిల్లా అధ్యక్ష్యుడు కిమిడి నాగార్జున డిమాండ్ చేసారు.

Related posts

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలి

Satyam NEWS

కొత్త ఏడాది లో తొలి రోజునే విద్యల నగరంలో కొత్తగా ట్రాఫిక్ ఇక్కట్లు…!

Satyam NEWS

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Satyam NEWS

Leave a Comment