40.2 C
Hyderabad
April 19, 2024 17: 04 PM
Slider ఖమ్మం

వాగు వంకలు దాటిన ఓ తల్లీ క్షేమంగా తిరిగిరామ్మా

#Tribal Girl

దేశం అభివృద్ధి చెందిందని చెప్పుకోవడం తప్ప వాస్తవం అలా కనిపించడంలేదు. వైద్య సదుపాయం లేని పల్లెలు ఇంకా ఉన్నాయి. ఆసుపత్రుల్లోనే ప్రసవించండి అని చెప్పడం తప్ప ప్రభుత్వాలు గర్భిణి మహిళలకు ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురావడం లేదు.

ఒక్కటైనా రెండైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన దేశం వెనకబడి ఉన్నట్లే అనిపిస్తున్నది. తాజాగా భద్రాద్రి కొత్త గూడెం జిల్లా గుండాల మండలంలోని వెల్లూరు గ్రామానికి చెందిన ఒక గర్భిణి అష్టకష్టాలు పడింది. ఆసుపత్రిలో చేరేందుకు ఉధృతంగా ప్రవహిస్తున్న మల్లన్న వాగు దాటాల్సి వచ్చింది. పూనం సంధ్యారాణి అనే ఈ మహిళకు తలచుకోవడానికి కూడా భయం వేసే కష్టం వచ్చింది.

ఒక వైపు పురిటినొప్పులు మరో వైపు పొంగుతున్న వాగు…… పురిటి నొప్పులు ఓర్చుకుంటూ… పొంగే వాగును దాటుకుంటూ ఆ తల్లి నానా యాతన పడ్డది. చివరకు మల్లన్న వాగు దాటిన తర్వాత అంబులెన్సు వచ్చింది. అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించారు కానీ…….మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే….???? ఈ ప్రభుత్వాన్ని ఆ తల్లి క్షమించి ఉండేదా?  

Related posts

ఎందుకో ఈ తొందర?: రేపే ఏపీ కేబినెట్‌ భేటీ

Satyam NEWS

కరెంటు ఇవ్వని కాంగ్రెస్ మనకెందుకు?

Bhavani

నిత్యావసర వస్తువుల నియంత్రణ లో ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS

Leave a Comment