27.7 C
Hyderabad
April 19, 2024 23: 09 PM
Slider కడప

రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందించాలి

#rayachoti

కడప జిల్లా రాయచోటి ఏరియా ఆసుపత్రిలో  కోవిడ్ సేవలును అందించేందుకు సిద్ధంగా ఉండాలని వైద్యాధికారులును చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు. రోజురోజుకూ కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో రాయచోటి ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ సేవలు అందించేందుకు అవసరమైన వసతులను సిద్ధం చేసుకోవాలని వైద్యాధికారులుకు ఆయన సూచించారు.

బెడ్స్,మందులు, ఐషోలేషన్ కిట్లు, ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్యులు, సిబ్బంది, వైద్య పరీక్ష పరికరాలు, మాస్కులు, గ్లౌజులు తదితర పరికరాలను, వస్తువులను తగిన మోతాదులో నిల్వ ఉంచుకోవాలని సూచించారు. బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించి మన్నలును పొందేలా కృషి చేయాలన్నారు.

గతంలో రెండు పర్యాయాలు మంచి వైద్య సేవలు అందించారని,అదే స్ఫూర్తితో మరింత మెరుగైన సేవలు అందించాలని ఆసుపత్రి పర్యవేక్షకుడు డా రెడ్డి మహేశ్వర రాజు,వైద్యాధికారులు డా రెడ్డి భాస్కర్ రెడ్డి, డా సునీత, డా ఖాదర్ బాష లను శ్రీకాంత్ రెడ్డి కోరారు. కోవిడ్ పరీక్షల నిమిత్తం ట్రూ నాట్ ల్యాబ్ ను కూడా ఏరియా ఆసుపత్రిలోనే ఏర్పాటు చేయిస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి పనులపై ఆయన చర్చించారు.

నిర్ణీత గడువులోగా ఆసుపత్రి భవన నిర్మాణాపు పనులను పూర్తి చేయాలి

నిర్మాణ దశలో ఉన్న రాయచోటి వందపడకల ఆసుపత్రి భవన నిర్మాణాలను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషతో, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ బేపారి మహమ్మద్ ఖాన్ , వైద్యాధికారులుతో కలసి  గురువారం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. పనుల నాణ్యతపై ఆరా తీశారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా  ఆక్సిజన్ సరఫరా అయ్యే వార్డుల మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.ఆపరేషన్ థియేటర్ గదిని కూడా వీలైనంత త్వరగా నిర్మాణ పనులును పూర్తిచేయాలన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించి ఆక్సిజన్ ఉత్పత్తి, సరపరాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు.సీమాంక్ గదులను కూడా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.   పోస్ట్ మార్టం,బయోమెడికల్ గదుల నిర్మాణాల పనులపై శ్రీకాంత్ రెడ్డి ఆరా తీశారు.

వైద్యసేవలపై శ్రీకాంత్ రెడ్డి ఆరా

రోగులకు అందుతున్న వైద్యసేవలపై శ్రీకాంత్ రెడ్డి ఆరా తీశారు.రోగుల దగ్గరికే వెళ్లి వైద్యం, భోజనం తదితరవసతులు సక్రమంగా ఉన్నాయా అని ఆయన అడిగి తెలుసుకున్నారు.

Related posts

బాదుడే బాదుడు పై విశాఖ లో తెలుగుదేశం నిరసన

Satyam NEWS

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

పాఠశాల మధ్యాహ్న భోజనం మెనూ లో స్వల్ప మార్పులు

Satyam NEWS

Leave a Comment