37.2 C
Hyderabad
March 28, 2024 20: 33 PM
Slider గుంటూరు

హెల్ప్ లెస్: ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి

chadalawada 161

ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ వైద్యం కూడా సరిగా అందడం లేదని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు.  కర్నూలు జిల్లాలో సకాలంలో వైద్యం అందక బాలింత ప్రాణాలు కోల్పోయిందని నెల్లూరు జిల్లాలో సమయానికి వైద్యం అందక శివ సాగర్ అనే వ్యక్తి చనిపోయాడని ఆయన అన్నారు.

వైద్యానికి పెద్ద పీట వేస్తున్నాం, వేల కోట్లు కేటాయిస్తున్నామని గంభీరమైన ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఈ ఘటనలకు ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు కనీస వైద్య సదుపాయాలు అందని పరిస్థితి ఈ రోజు నెలకొంది.

లాక్ డౌన్ మొదలయ్యాక ఈ 22 రోజుల్లో అత్యవసర సేవలు అందక పలువురు ప్రాణాలు కోల్పోయారు. అత్యవసర సేవలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యామ్నాయం చూపడం లేదు. పోయిన ప్రాణాలను పాలకులు తీసుకురాగలరా? వారి కుటుంబాలకు అండగా నిలబడతారా? అని ఆయన ప్రశ్నించారు.

కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం కోసం పలానా చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం ధైర్యంగా చెప్పగలదా? వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఏనాడైనా ప్రభుత్వాసుపత్రులను సందర్శించారా?  రోగులకు అందుతున్న వైద్యం గురించి వాకబు చేశారా? 

ఓ వైపు కరోనా మరోవైపు అత్యవసర సేవలు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి, వైద్యశాఖామంత్రికి చీమ కుట్టినట్టయినా లేదని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడల కారణంగా వైద్యులు ఆస్పత్రులకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.

రక్షణ పరికరాలు అందివ్వకపోయినా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోయినా వృత్తిధర్మం పాటించి ఇన్నాళ్లూ వారు వైద్యం చేశారు.. ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్న  వైద్యులకు  దక్కిందేమిటి? వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ పోకడల ఫలితంగా పలువురు వైద్యులు , వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు.

ప్రాణాలు పోతున్నాయి ఎన్ 95 మాస్కులు ఇవ్వండని వైద్యులు అడగటం నేరమా? అని డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థ విధానాలపై ఒక రోజు నిరసన దీక్ష చేసిన డాక్టర్ చదలవాడకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేములపల్లి నర్సయ్య, కడియాల రమేష్, సింహాద్రి యాదవ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

Related posts

4వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

Satyam NEWS

శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో డప్పు,చెప్పుకు పెన్షన్ ప్రకటించాలి

Satyam NEWS

డప్పు కొట్టే మీడియాతో అధికార పార్టీకే నష్టం

Satyam NEWS

Leave a Comment