కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం డిప్లమో అనస్తీషియా చదువుతున్న గుంపుల సుధారాణి(19) అనే వైద్య విద్యార్థిని హత్యకు గురైంది.
సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ చెందిన సుధారాణి, పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కాకి పాడు కు చెందిన మానేపల్లి రాజు (21), గత పది నెలల నుంచి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
వీరిద్దరూ కలిసి కాకినాడ ద్వారకా లాడ్జిలో దిగారు. ఏమైందో ఏమో కారణాలు తెలియలేదు.
నిన్న రాత్రి గొడవపడి భర్త రాజు సుధారాణి కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.. ఆ తర్వాత రాజు ఏలూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.