28.2 C
Hyderabad
April 20, 2024 11: 20 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో సిబ్బందికి నిర్బంధ వైద్య పరీక్షలు

#Anilkumar Singhal TTD

తిరుమలను సందర్శించే భక్తులందరికీ ఎటువంటి రాజీ లేకుండా కరోనా పరీక్షను నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టిటిడి అడ్మినిస్ట్రేటివ్ భవనంలోని ఛాంబర్ లో సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ భారత్ నారాయణ్ గుప్తా, ఇతర అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

తిరుమలలోని వివిధ ప్రదేశాలలో టిటిడి ప్రతిరోజూ కనీసం 100 మంది ఉద్యోగులకు రాండమ్ గా కరోనా పరీక్షలు చేస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా పరీక్షించిన 24 గంటలలోపు నివేదికలను అందించాలని ఈవో కలెక్టర్‌ను కోరారు. తిరుమలలో పనిచేస్తున్న టిటిడి ఉద్యోగులందరూ కూడా తమ విధి ప్రాంతాలను మార్చకుండా వారానికి ఒకే చోట పనిచేయాలని ఆదేశించారు.

ఉద్యోగుల ప్రయోజనం కోసం టిటిడి కేంద్ర ఆసుపత్రిలో అదనపు వెంటిలేటర్లను అందించాలని జెఇఒ టిటిడి శ్రీ పి బసంత్ కుమార్ ను ఆయన ఆదేశించారు. శ్రీనివాసం రెస్ట్ హౌస్‌ను జిల్లా కలెక్టర్‌కు అప్పగించాలని ఆయన జెఇఓకు ఆదేశించారు. అవసరమైతే, BIRRD ఆర్థో ఆసుపత్రిని కోవిడ్ -19 కేంద్రంగా మార్చే విషయం పరిశీలించాలని, దీనిపై తదుపరి సమీక్షా సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని EO తెలిపారు.

ఇప్పటికే క్వారంటైన్ కేంద్రంగా కేటాయించిన మాధవం రెస్ట్ హౌస్ టిటిడి ఉద్యోగులు, వారి బంధువుల కోసం ఉపయోగించవచ్చునని ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఇఓ ఎవి ధర్మరెడ్డి, సివిఎస్ఓ గోపీనాథ్ జట్టి, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య, టిటిడి ఆరోగ్య అధికారి డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైసీపీ ఎమ్మెల్యే దూషణలతో మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

నాగర్ కర్నూల్ ఎస్సీ మెనెజ్ మేంట్ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న వనజీవి రామయ్య

Satyam NEWS

Leave a Comment