Slider నిజామాబాద్

విద్యార్థులకు మాత్రలు వేసిన ఎమ్మెల్యే హన్మంత్ షిండే

students

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం బిచ్కుంద మండల కేంద్రంలోని బాలికల పాఠశాలలో జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే విద్యార్థులకు మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల వరకు పిల్లలు ఆల్బెండజోల్ మాత్రలు తప్పక వేసుకోవాలని, విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి భారతి రాజు, ఎంపిటిసి అశోక్ పటేల్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజ్ పటేల్, వైద్యులు సతీష్ కుమార్, ఆరోగ్య బోధకులు దస్తీరాం, ఉప సర్పంచ్ నాగరాజు,  ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. మండలంలోని  ఫథలాపూర్ గ్రామంలోని అంగన్ వాడి సెంటర్ లో సర్పంచ్ అరుణ్, ఉప సర్పంచ్ సంగప్ప పిల్లలకు మాత్రలు అందించారు.

అదే విధంగా వాజిద్ నగర్ గ్రామంలో సర్పంచ్ అనూయ, ఉప సర్పంచ్ సాయిలు, ఆరోగ్య కార్యకర్త దుర్గామణి, రాజుల గ్రామంలో సర్పంచ్  చ౦ద్రభాగ అశోక్, బండ రెంజల్ గ్రామంలో సర్పంచ్ గడ్డం బాల్రాజ్, దేవాడ గ్రామంలో సర్పంచ్ శివానంద్ అప్ప, సితరం పల్లి గ్రామంలో సర్పంచ్ గంగారెడ్డి, విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Related posts

రష్యాతో అనుబంధం మళ్లీ చిగురించే అవకాశం ఉందా….?

Satyam NEWS

పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి

Satyam NEWS

ఉత్సవాలు ఘనంగా జరపాలి

Bhavani

Leave a Comment