జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది.ఎన్నో కలలతో వైద్యవిద్యను అభ్యసిస్తున్న విద్యార్ధి బ్రతుకును బుగ్గిపాలుచేశారు.మరో సంవత్సరం పూర్తయితే ప్రజలకు వైద్యం అందించే యువకుడిని కొట్టిచంపారు హంతకులు.జిల్లాలోని రేగొండ మండలం కనపర్తి గ్రామంలో ఎంబీబీఎస్ చదువుతున్న తుమ్మలపల్లి వంశి(20) అనే విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి బావిలో పడేశారు.
కాళ్లు, చేతులు కట్టేసి కర్రలతో కొట్టడంతోనే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి స్వస్థలం తుమ్మలపల్లి గ్రామంగా గుర్తించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వంశి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వంశి ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నాడు.