రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా మీ సేవ సెంటర్లను మూసేసే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలుగుదేశం పార్టీ నరసరావుపేట అసెంబ్లీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. సచివాలయ కార్యదర్శుల పేరిట పెట్టిన వ్యవస్థ కారణంగా గత 10 సంవత్సరాలుగా ఉన్న మీసేవా కేంద్రాలు మూతపడే స్థితికి వచ్చాయని ఆయన అన్నారు.
మీ సేవ కేంద్రాలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారికి ద్రోహం చేసే విధంగా ప్రవర్తిస్తున్నదని అరవిందబాబు ఆరోపించారు. నేడు స్థానిక ఏంజెల్ టాకీస్ ధర్నా సెంటర్ లో మీ సేవ నిర్వాహకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జి అరవింద బాబు పాల్గొని మద్దతు తెలిపారు. మీ సేవ కేంద్రాలు చేసే విధులను గ్రామ సచివాలయంలో విలీనం చేయడం తగదని ఆయన ఈ సందర్భంగా అన్నారు.