36.2 C
Hyderabad
April 16, 2024 19: 11 PM
Slider ప్రత్యేకం

విభజన సమస్యలపై 23న సమావేశం

#home

రాష్ట్ర  విభజన సమస్యలపై ఈనెల 23న దిల్లీలో కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలో మరోసారి సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ అధికారులకు కేంద్రహోంశాఖ అధికారులు సమాచారం పంపారు. సమావేశానికి తప్పకుండా హాజరవ్వాలని సూచించినట్లు సమాచారం. పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలపై సెప్టెంబర్‌ 27న జరిగిన సమావేశంలో ఉమ్మడి అంశాలతో పాటు ఏపీకి చెందిన ఏడు అంశాలపై అధికారులు చర్చించారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, అమరావతికి అనుసంధానం చేసే రైల్వే ప్రాజెక్టులు తదితర అంశాలను గత సమావేశం అజెండాలో కేంద్రం చేర్చింది. అయితే ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు లేకుండానే భేటీ అసంపూర్తిగా ముగిసింది. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను 10 ఏళ్లలోపు పూర్తిచేయాలనే నిబంధనలు ఉన్నందున ఆ మేరకు వాటిని పరిష్కరించే దిశగా కేంద్రహోంశాఖ సమావేశాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే ఈనెల 23న తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం జరగనుంది.

Related posts

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఎక్కువ విద్యుత్ చార్జీలు

Satyam NEWS

సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం: పసుపులేటి ప్రదీప్ కుమార్

Bhavani

న్యూ క్రాప్: తెలంగాణ నేలపై పండుతున్న డ్రాగన్ ఫ్రూట్

Satyam NEWS

Leave a Comment