కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారీ ఉచిత కంటి వైద్యం శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం వాగ్దేవి విద్య సంస్థల డైరెక్టర్ లు రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు రాయల శ్రీనివాసరావు, పాశం కృష్ణ రావు, ప్రముఖ వైద్యులు విజయ పద్మావతి నర్సింగ్ హొమ్ నరసరావుపేట డాక్టర్ ఓగురి కోటయ్య ,సౌజన్య నర్సింగ్ హొమ్ కారంపూడి, డాక్టర్ మల్లెమారాపు సత్యనారాయణ ,శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అనిత, డాక్టర్ ప్రీతి, రోటరీ క్లబ్ అధ్యక్షులు కాకుమాను శ్రీనివాసరావు తదితరులు ప్రారంభించారు.
జిల్లా అంధత్య నివారణ సంస్థ గుంటూరు జిల్లా, వాగ్దేవి విద్య సంస్థలు నరసరావుపేట, గుంటూరు పెదకాకాని శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో షుమారు 500 వందలమందికి కంటి పరీక్షలు చేయగా వారిలో 120 మంది ఆపరేషన్ కు సెలెక్ట్ అయ్యారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కాకుమాను శ్రీనివాసరావు, సెక్రటరీ పులిపాటి రమేష్, రొటేరియన్ యస్ కె. జిలనిమాలిక్, జమ్ముల రాధకృష్ణ , మెళ్ల చెరువు సుమిత్ర కుమార్ , వెల్లంపల్లి కేశవరావు, ఓగురి నాగేశ్వరరావు,ఒప్పిచర్ల గ్రామ పెద్దలు కొండపల్లి అప్పారావు, కొండపల్లి అనంత రామయ్య, కోరాకుల పెద సాంబయ్య, కోరాకుల వెంకట శివయ్య, ఓగురి రామయ్య, ఓగురి కోటేశ్వరరావు, శంకర్ కంటి అస్పటల్ మెడికల్ క్యాంప్ ఇంచార్జ్ సైదులు, నర్సింగ్ స్టాఫ్ నరసరావుపేట రోటరాక్టు ప్రెసిడెంట్,సెక్రటరీ, తదితర సభ్యులు హాజరయ్యారు.