28.2 C
Hyderabad
April 30, 2025 06: 25 AM
Slider ఆంధ్రప్రదేశ్

అన్ని దానాల్లోకెల్లా మిన్న రక్తదానం

health camp

మహాత్మ గాంధీ 150 వ జయంతి, జాతీయ సేవా పధకం  50వ వార్షికోత్సవ వేడుకల సందర్భం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో మెగా రక్త దాన శిబిరం, ఉచిత ఆరోగ్య, కంటి చికిత్స శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శన రావు ముఖ్య అతిధిగా విచ్చేసి శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని తెలిపారు. మనమిచ్చే ఒక్క చుక్క రక్తం కొందరి జీవితానికి ప్రాణ దాత గా మారుతుందని అన్నారు.  రక్త దాతలను పేరు పేరున అభినందించారు. ఈ మెగా రక్త దాన శిబిరంలో 132 యూనిట్స్ రక్తం సేకరించారు. అలాగే సుమారు 180 అధ్యాపక, అధ్యాపకేతర,  విద్యార్థిని విద్యార్థినీ విద్యార్థులకు డయాబెటిస్, బీపీ  పరీక్షలు సింహపురి హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో చేశారు. అలాగే ఉచితంగా మందులు ఇచ్చారు. కార్యక్రమాన్ని నిర్వహించిన సమన్వయ కర్తలు డా. కోట నీల మణికంఠ, డా. ఉదయ్ శంకర్ అల్లం ను ఉపకులపతి అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి, విద్యార్థులలో సేవా భావం పెంపొందించేటట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న అనుబంధ కళాశాలలైన ఆదిత్య , జగన్స్ కృష్ణ చైతన్య, స్వాతి డిగ్రీ కళాశాల యాజమాన్యాన్ని, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు. సుమారు 50 మంది కి  ఈసీజీ  ని చేశామని సింహపురి హాస్పిటల్స్ వైద్యురాలు డా. శ్రీలక్ష్మి తెలిపారు డా. అగర్వాల్ నేత్రాలయం వారి వైద్యబృందం సుమారు 140 మందికి ఉచితమంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా 114 మందికి రెప్రాక్టీవ్ ఎర్రర్స్ (కంటి అద్దాల అవసరం). పొడిబారిన కళ్ళు , ఇద్దరికీ క్యాటరాక్ట్స్, ఒకరిలో రెటీనా ఎర్రర్స్ ను  గుర్తించామని అగర్వాల్ నేత్రాలయ డాక్టర్ మోహన్ అన్నారు.   ఈ కార్యక్రమం లో రిజిస్ట్రార్  ఆచార్య అందే ప్రసాద్, ప్రిన్సిపాల్ ఆచార్య  KVSN జవహర్ బాబు, డీన్ సీడీసీ ఆచార్య విజయ్ ఆనందకుమార్ బాబు  వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. \

Related posts

హైదరాబాద్ లో రెండు గంటల హై ఎలర్ట్

Satyam NEWS

గోల్నాక డివిజన్ లో మంచి నీటి పైప్ లైన్ కు శంకుస్థాపన

Satyam NEWS

కేంద్రం ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!