మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జట్ చిత్రం సైరా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 18న గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అయితే రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడడం, బోటు ప్రమాదం జరిగి మనుషులు చనిపోవడం చూసి.. ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో సంతోషంగా సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడం కరెక్ట్ కాదని భావించిన చిరు, చరణ్ ఈవెంట్ ని వాయిదా వేశారు. సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ 18 నుంచి 22కి వాయిదా పడింది. ప్రిరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది కానీ ముందుగా అనౌన్స్ చేసినట్లుగానే సైరా ట్రైలర్ మాత్రం 18న బయటకి రానుంది. సైరా స్థాయిని ఇండియన్ సినీ లవర్స్ కి తెలియజేసే రేంజులో కట్ చేసిన ట్రైలర్, సినిమా ప్రొమోషన్స్ కి కొత్త ఊపు తెస్తుందని దర్శక నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 22న హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకధీర ఎస్. ఎస్. రాజమౌళి, సక్సెస్‌పుల్ డైరెక్టర్ కొరటాల శివ, మాస్ డైరెక్టర్ వివి వినాయక్ అతిథులుగా రాబోతున్నారు.
previous post
next post