35.2 C
Hyderabad
April 20, 2024 15: 57 PM
Slider ప్రపంచం

దూసుకువస్తోన్న భారీ తోకచుక్క.. భూమిని ఢీకొట్టనుందా..?

హేలీ తోక చుక్క పేరు విన్నారా? మీరు కనుక 1980 తర్వాత పుట్టి ఉన్నవాళ్లు అయితే వినే ఉంటారు. ఆకాశంలో తెల్లటి పాయలా మెరిసే ఈ తోక చుక్క అవశేషాలు ఇప్పటికీ మన భూ వాతావరణంలో తిరుగుతున్నాయి. ప్రతి ఏడాదిలో రెండుసార్లు ఈ తోక చుక్క అవశేషాలు కనిపిస్తాయి. ఈ అవశేషాలతో భూమంతా హేలీ తోక చుక్క నుంచి రాలిపోయిన దుమ్ముతో నిండిపోతుంది.

ఇది ప్రతి 75-76 ఏళ్లకొక సారి కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తోకచుక్క 1986లో కన్పించగా.. తర్వాత 2061లో కన్పించనుంది. అయితే తాజాగా మరో భారీ తోక చుక్కను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి C/2014 UN271 అనే నామకరణం చేశారు. ఈ తోకచుక్క పరిమాణంలో అత్యంత భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది మన సౌర వ్యవస్థ నుంచి ప్రయాణిస్తోంది. 2031 సంవత్సరంలో మన సూర్యుడికి, భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం.. భూమికి ఈ తోకచుక్క నుంచి ఎటువంటి ముప్పు లేదని స్పష్టం చేస్తున్నారు.

Related posts

ఎగ్జిట్: సిగ్గుతో తప్పుకుంటున్న పృథ్వి

Satyam NEWS

భారీ ఎత్తున అక్రమ కలప దుంగలు స్వాధీనం

Satyam NEWS

రాజకీయాల నేపథ్యంలో దర్యాప్తు సంస్థల పనితీరుపై అనుమానాలు

Bhavani

Leave a Comment