21.2 C
Hyderabad
December 11, 2024 21: 54 PM
Slider ఆంధ్రప్రదేశ్

జగన్ ను కలవనున్న మెగాస్టార్ చిరంజీవి

pjimage (6)

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారు. తాను కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా సీఎం జగన్‌ను చిరంజీవి కోరనున్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. ‘సైరా’ సినిమాను వీక్షించాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను చిరంజీవి ఇటీవల కోరడం, ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంచిన విషయం తెలిసిందే. తొలితరం స్వాతంత్ర్య పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంపై సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం.

Related posts

ఫైనల్: ఫలించిన ముఖేష్ అంబానీ రాయ ‘బేరం’

Satyam NEWS

వైద్య సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసిన డాక్టర్ కరుణాకర్

Satyam NEWS

శ్రీ‌శైలం నుంచి సాగ‌ర్‌కు 14 నుంచి లాంచీ ప్ర‌యాణం

Sub Editor

Leave a Comment