మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డికి న్యాయపరమైన చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నది. తమకు న్యాయం జరిగే వరకూ సినిమాను విడుదల చేయరాదని కోరుతూ ఉయ్యాలవాడ వారసులు కోర్టుకెక్కారు. దాంతో ఈ పిటీషన్ పై రేపు విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. చిత్ర హీరో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉయ్యాలవాడ వారసులు ఫిర్యాదు లో పేర్కొన్నారు. తమ నుంచి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథ తీసుకొని తమను మోసం చేశారని వారు ఆరోపిస్తున్నారు. తమకు చిరంజీవి, రామ్ చరణ్ లు తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని, న్యాయం కోసం పోరాటం చేస్తే తమపైనే అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. తమకు న్యాయం చేసే వరకు సైరా నర్సింహారెడ్డి సినిమాను విడుదల చేయొదంటూ పిటిషన్ లో వారు పేర్కొన్నారు
previous post