మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం కలెక్షన్లలో బ్లాక్ బస్టర్ స్థాయికి చేరుకుంది. తొలి రోజు కన్నా రెండో రోజు కలెక్షన్లు బాగా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా తొలి రెండు రోజుల్లోనే 85 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రెండు రోజుల్లో రూ.32 కోట్లు వసూలయ్యాయి. పాజిటీవ్ టాక్ రావడంతో సైరా నరసింహారెడ్డి కలెక్షన్లలో దూసుకుపోతున్నది. తెలుగు సినిమా చరిత్రలో ఇంతటి ఘన వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా సైరా నరసింహారెడ్డి నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూడో తెలుగు చిత్రంగా సైరా నిలిచింది. అదే విధంగా దక్షిణాది చిత్రాలలో ఐదవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. చారిత్రక చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా సైరా చిత్రం నమోదయింది
previous post