40.2 C
Hyderabad
April 19, 2024 16: 38 PM
Slider సినిమా

చిరంజీవి కొత్త చిత్రానికి టైటిల్ ‘వీరయ్య’ ?

#chiranjivi

యంగ్ హీరోలకు దీటుగా చిరంజీవి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా పట్టాలెక్కిస్తున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో బిజీగా వున్నారు.

ఇక దీని తర్వాత మరో మూడు సినిమాలు ఇప్పటికే ఓకే అయ్యాయి. వీటిలో మలయాళ హిట్ చిత్రం ‘లూసిఫర్’ ఒకటి. దీనికి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. ‘ఆచార్య’ తర్వాత ఇదే ముందుగా సెట్స్ కి వెళుతుంది.

ఇక ఆ తర్వాత ఆయన మరో రెండు సినిమాలు చేయాల్సి వుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘వేదాళం’ తమిళ చిత్రం రీమేక్ ఒకటి కాగా.. బాబీ దర్శకత్వంలో రూపొందే చిత్రం మరొకటి. అయితే, వీటిలో బాబీ సినిమానే ముందుగా సెట్స్ కి వెళుతుందని అంటున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతుందని తెలుస్తోంది.

దీని కోసం హీరో పాత్రను బట్టి ఈ చిత్రానికి ‘వీరయ్య’ అనే టైటిల్ని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. మరి, ఇందులో వాస్తవం ఎంతన్నది త్వరలో వెల్లడవుతుంది.

Related posts

కమలం పైకి మళ్లుతున్న యురేనియం సెగలు

Satyam NEWS

పూతలపట్టు వద్ద ఘోర ప్రమాదం: 6గురి మృతి

Satyam NEWS

స్వంత వర్గాన్ని వైసీపీపై రుద్దేందుకు గంటా ప్లాన్

Satyam NEWS

Leave a Comment