మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా సైరా, మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సైరా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 2నే సైరా రిలీజ్ కాబోతోంది, ప్రొమోషన్స్ అనుకున్న స్థాయిలో జరగట్లేదని అభిమానులు అనుకుంటున్న టైములో సైరా ట్రైలర్ రిలీజ్ అయి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని నేరుగా చూడని వారు, ట్రైలర్ లో చిరంజీవిని చూస్తే ఆ వీరుడు ఇలానే ఉండి ఉంటాడా? అతని గొంతు అంతే గంభీరంగా ఉండేదా? ఆ కళ్లలో వేడి అలానే ఉండేదా? అతను కదులుతుంటే ఒక యుద్ధమే కదిలినట్లు అనిపించేదా? అంటే నిజమే అనిపించేలా ఉంది. చిరంజీవిని చూస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకి అతని కోసమే పుట్టిందా అనిపించింది. మూడు నిమిషాల నిడివితో విడుదల చేసిన సైరా ట్రైలర్, అమితాబ్ గొంతుతో మొదలయ్యింది.. సైరాని పట్టుకోవడం కష్టం అనే డైలాగ్ తో జరిగిన ఇంట్రో మెగాస్టార్ ని మరో స్థాయిలో చూపించింది. ముఖ్యంగా ట్రైలర్ మొదలైన పది పదిహేను సెకండ్స్ లోనే వినిపించే అనుష్క గొంతుతో అతనొక యోగి అని చెప్తుంటే వచ్చే విజువల్ అద్భుతం. యుద్దానికి సిద్ధమయ్యే ముందు ఉండే ప్రశాంతతని చూపిస్తున్నట్లు శివలింగం ముందు చిరంజీవి కూర్చున్న సీన్ నిజంగా అద్భుతమే.
previous post
next post