23.2 C
Hyderabad
November 29, 2021 16: 39 PM
Slider సంపాదకీయం

తమ్ముడ్ని తిడుతున్నా ఉలకని పలకని చిరంజీవి

#megastar

తమ్ముడు పవన్ కల్యాణ్ ను అధికార వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు తిడుతున్నా మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇప్పటి వరకూ బహిరంగంగా నోరు విప్పకపోవడం పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. సినిమా టిక్కెట్ల వ్యవహారం ఒక్క పవన్ కల్యాణ్ కే కాకుండా తెలుగు చిత్ర సీమలోని అగ్ర హీరోలందరికి జీవన్మరణ సమస్య. జగన్ ప్రభుత్వం తీసుకువస్తున్న ఆన్ లైన్ టిక్కెట్ వ్యవహారం చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లూ అర్జున్ లాంటి మాస్ కలెక్షన్ హీరోలందరికి సమస్య.

తొలి మూడు రోజుల్లో భారీ కలెక్షన్లు రాబట్టుకోలేకపోతే అగ్ర హీరోల మార్కెట్ డౌన్ అవుతుంది. అలాగని ఇది కేవలం అగ్ర హీరోల సమస్య మాత్రమే కాదు. అగ్ర హీరోల సినిమా ఒక్కో దానికి మేకింగ్ చార్జీలే 60 నుంచి వంద కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. ఇందులో పావు వంతు హీరోకు వెళ్లినా మిగిలినదంతా సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్టుల వారికే వెళుతుంది. అగ్ర హీరో సినిమా విడుదల అయితే ధియేటర్ల యజమానుల నుంచి డిస్ట్రి బ్యూటర్ల వరకూ లాభాలలో వాటా ఉండటమే కాకుండా కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది.

జగన్ ప్రభుత్వాన్ని బతిమాలుకుంటున్న చిరంజీవి

అగ్ర హీరోల సినిమాలు లేకపోతే చిన్న సినిమాలతో లాభం కేవలం కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. పైగా చాలా మందికి ఉపాధి దూరం అవుతుంది. ఇంత పెద్ద సమస్యను జగన్ ప్రభుత్వం సృష్టిస్తే దానిపై లవ్ స్టోరీ చిత్ర విడుదల కార్యక్రమంలో చిరంజీవి బతిమాలుతున్న చందంగా మాట్లాడారు. అదే విషయాన్ని పవన్ కల్యాణ్ రిపబ్లిక్ చిత్రం కార్యక్రమంలో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు.

కేవలం తనపై కోపంతో సినీ పరిశ్రమను నాశనం చేయవద్దని పవన్ కల్యాణ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని రాజకీయం చేస్తూ వైసీపీ మంత్రులు మూకుమ్మడి దాడి చేశారు. సినీనటుడు పోసాని కృష్ణ మురళితో దారుణమైన విమర్శలు చేయించారు.

పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. పైగా ఈ విషయం మొత్తాన్ని కాపు కులస్తులను విభజించేందుకు ఉపయోగించుకుంటున్నారు. సినీ పరిశ్రమ, కాపు కులం…. ఈ రెండు విషయాలూ చిరంజీవికి సంబంధం ఉన్నవే. ఈ రెండు అంశాలతో బాటు తన సొంత తమ్ముడు పవన్ కల్యాణ్ వివాదంలో చిక్కుకున్నారు. అంటే ఈ మూడు విషయాలూ చిరంజీవికి సంబంధించినవే.

అయితే చిరంజీవి మాత్రం తన తమ్ముడికి గానీ, చిత్రసీమకు గానీ, కాపు కులానికి గానీ బాసటగా ఇప్పటి వరకూ మాట్లాడలేదు. చిరంజీవి ఈ మూడు కీలక అంశాలపై తప్పించుకునే ధోరణి అవలంబించడంపై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా మనోవేదనకు గురి అవుతున్నారు.

కాపుకులం ఉనికికే ప్రశ్నార్ధకమైనా……

జగన్ పై ఇంతకాలం సాఫ్ట్ కార్నర్ తో ఉన్న చిరంజీవి రాజకీయంగా ఏనాడూ తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు మద్దతు పలుకలేదు. అమరావతి రైతులు అలో లక్ష్మణా అంటూ ఏడుస్తున్నా చిరంజీవి పట్టించుకోలేదు. ఇప్పుడు సినీ పరిశ్రమ మొత్తం అల్లకల్లోలం అయ్యే పరిస్థితి ఏర్పడినా, తమ్ముడి చుట్టూ వివాదం ముసురుకున్నా, కాపు కులం ఉనికినే వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నా చిరంజీవి మౌనం వహించడం ఎందుకో పవన్ అభిమానులకు అర్ధం కావడం లేదు.

ఈ మూడు సమస్యలు కేవలం పవన్ కల్యాణ్ కు సంబంధించినవే కాదు. కాపుకులం అండలేకపోతే చిరంజీవికి వెన్నెముక విరిగినట్లే అవుతుంది. సినీ పరిశ్రమలో ఆన్ లైన్ టిక్కెట్ విధానం వచ్చి కలెక్షన్లు మొత్తం ప్రభుత్వం చేతుల్లోకి పోతే చిరంజీవి కుటుంబానికి ఈ ఏడాది, వచ్చే ఏడాది కలిపి దాదాపు ఐదు వందల నుంచి ఏడు వందల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుంది.

అయినా చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు మాట సాయం కూడా ఇప్పటి వరకూ చేయకపోవడం లో అంతరార్ధం ఏమిటని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Related posts

కాకినాడ ఆర్టీసి కాంప్లెక్స్ లో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం

Satyam NEWS

మేడారం మినీ జాతరలో కరోనా వైరస్ కలకలం

Satyam NEWS

గజ్వేల్ లో మున్నూరు కాపు మహాసభ సమావేశం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!