22.2 C
Hyderabad
December 10, 2024 11: 51 AM
Slider సినిమా

సైరా విడుదల తేదీ పై సంశయం వద్దు

sye-raa-narasimha-reddy-updates

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన కుమారుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం మొదలు పెట్టిన నాటి నుంచి అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో చిత్రం విడుదల తేదీపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిత్రం అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉండగా గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కానందున చిత్రం విడుదల తేదీ వాయిదా వేస్తున్నారని పుకార్లు వ్యాపించాయి. అక్టోబర్ 8 న చిత్రం విడుదల చేస్తారని మరో వర్గం చెబుతున్నది. ఈ విధమైన తికమక ఏమీ లేదని చిత్రం ముందు అనుకున్న ప్రకారం అక్టోబర్ 2నే విడుదల అవుతున్నదని చిత్ర యూనిట్ స్పష్టం చేస్తున్నది. రోజురోజుకి అంచనాలు పెంచుతున్న సైరా నుంచి బయటకి వచ్చిన లేటెస్ట్ అప్డేట్, పాటల గురించి. సైరా సినిమాలో మూడు పాటలు మాత్రమే ఉంటాయని, అందులో ఒకటి బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ కాగా మరొకటి ఉయ్యాలవాడ ఎంట్రీ సాంగ్ అని మూడో పాట జాతర పాటని సమాచారం. చిత్రంలోని లీడ్ కాస్ట్ అందరితో పాటు ప్రజల మధ్య చిత్రీకరించిన జాతర పాట సినిమాకే హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. సైరాలో మూడు పాటలు మాత్రమే ఉంటాయనే విషయం తెలిసిన మెగాఫ్యాన్స్ మాత్రం ఒకింత డిజప్పాయింట్ అవుతున్నారు. చిరు సినిమాలో మూడు పాటలే ఉండడమేంటని అనుకుంటున్నారు కానీ ఆరు పాటలు, నాలుగు ఫైట్లు ఉండడానికి సైరా ఏమైనా రెగ్యులర్ కమర్షియల్ సినిమానా? అదో చరిత్ర. జనం మరిచిన చరిత్ర, చిరు 11 ఏళ్లుగా చెప్పాలనుకునే చరిత్ర అందుకే కథపైన మాత్రమే దృష్టి పెట్టి ఎలాంటి హంగుల జోలికి వెళ్లకుండా చిత్ర యూనిట్ చాలా నిజాయతీగా కేవలం ఉయ్యాలవాడ కథని చెప్పడానికి మాత్రమే ప్రయత్నిస్తోంది. పాటలు లేకపోయినా పోరాటాలు ఉంటాయి… తెల్లదొరలపై మొదటిసారి మన తెలుగు వాడు చేసిన అద్భుతమైన పోరాటాలు ఉంటాయి, ఆ తర్వాత దేశం కోసం పోరాడాలి అనుకునే ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన అతని కథ ఉంటుంది. అక్టోబర్ 2న థియేటర్ కి వెళ్లి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీర చరిత్రని, మనం మరిచిన మన వీరుడి చరితని చూసి గర్వపడండి.

Related posts

జగన్ వెళ్లగొట్టిన పరిశ్రమలను మళ్లీ రప్పిద్దాం

Satyam NEWS

చంద్రబాబు అవినీతి బట్టబయలు చేశాం

Satyam NEWS

కార్మిక హక్కులు కాలరాస్తున్న కాంట్రాక్టు ఉద్యోగాలు

Satyam NEWS

Leave a Comment