30.7 C
Hyderabad
April 23, 2024 23: 14 PM
Slider కృష్ణ

మచిలీపట్నం లో ఘనంగా ముగిసిన అవతార్ మెహర్ బాబా సంకీర్తన

#AvatarMeharBaba

మచిలీపట్నం లోని పోర్ట్ రోడ్డు లోని మెహెర్ బాబా మందిరంలో బాబా జన్మ దినోత్సవం పురస్కరించుకుని నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. పోర్ట్ రోడ్డు, ఆజాద్ రోడ్డు, గొడుగు పేట, చల్లరస్త్ర, చేమ్మన్నగిరి పేట, మున్సిపల్ కార్యాలయం,కొనేరుసెంటర్ మీదగా బాబా భజనలతో బాబా ప్రేమికులు నగర సంకీర్తన నిర్వహించారు.

బాబా ప్రేమికులు మెహర్ సుధాకర్ మాట్లాడుతూ మెహర్ బాబా ఇతరులను సంతోష పెట్టడం లోనే మనకు నిజమైన సంతోషం లభిస్తుందిఅని, ఏ మతానికి చెందిన వాడుని కాదు అన్ని మతాలు నావే అన్నా ఐక్యత రాగాన్ని అందరూ అలవాటు చేసుకోవాలని అన్నారు.

బాబా ప్రేమికురాలు తాడేపల్లి శ్యామల మాట్లాడుతూ మెహెర్ బాబా తన జీవిత కాలంలో నేను మిమ్మల్ని జాగృతం చేయడానికి వచ్చాను, భోదించడానికి  కాదు అంటూ, దైవం మానవ రూపంలో ఇచ్చిన సందేశాలు ఆచరణ యోగ్యంగా అందరూ అమలు చేయాలని అని అన్నారు.

సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ మానవసేవే మాధవ సేవగా ముందుకు వెళ్లాలని న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అన్నారు.

ఈ కార్యక్రమంలో  మెహర్ బాబా మందిర్ కార్యదర్శి కురాళ్ల సత్యనారాయణ, కోశాధికారి వేద శంకర్రావు, బాబా ప్రేమికులు ఎం. ఎస్. ఎస్ .ఎన్ మూర్తి, పల్లపోతు సుబ్రహ్మణ్యేశ్వరరావు, పల్లపోతు చంద్ర కుమారి, మాదిరెడ్డి అంజిబాబు, మాదిరెడ్డి బాబా ఇతర బాబా ప్రేమికులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం జరిగింది.

Related posts

చంద్రబాబు కుట్ర వల్లనే ఆంధ్రప్రదేశ్ లో కరోనా విస్తరణ

Satyam NEWS

బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి

Satyam NEWS

కోవిడ్ ఎలర్ట్: మీడియా పాయింట్ వద్ద నో ఎంట్రీ

Satyam NEWS

Leave a Comment